News
News
X

Katrina - Anushka: మా పక్కింట్లో ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీల బెడ్ రూమ్ సీక్రెట్‌ చెప్పేసిన అనుష్క శర్మ

తన పక్కింట్లోనే నివసిస్తున్న కత్రినా-విక్కీలకు అనుష్క శర్మ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక వారి ఇంటి నుంచి శబ్దాలు రావంటూ కొంటె కామెంట్లు చేసింది. మరి, ఆమె ఉద్దేశం ఏమై ఉండొచ్చు.

FOLLOW US: 

త్రినా.. విక్కీ.. ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే, ఈ విషెస్‌లో క్రికెటర్ విరాట్ కొహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన విష్.. అన్నిటికంటే ప్రత్యేకమైనది. ‘సెన్సార్’కు చిక్కకుండా చాలా తెలివిగా ఆమె విష్ చేసింది. కత్రినా - విక్కీల బెడ్ రూమ్ సీక్రెట్‌ను బయటపెట్టింది. 

కత్రినా, అనుష్క శర్మలు కలిసి ‘జీరో’, ‘జబ్ తక్ హై జాన్’ చిత్రాల్లో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. పైగా వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. అనుష్క, కొహ్లీ.. ముంబయిలోని జుహూలో రాజ్‌మహాల్‌లోని 8వ అంతస్థులో అల్ట్రా లగ్జరీ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. కత్రినా భర్త విక్కీ కౌశల్ కూడా అనుష్క ఇంటి పక్కనే ఫ్లాట్ తీసుకున్నాడు. మరి, పొరిగింటి ఫ్రెండ్ పెళ్లయితే.. అనుష్క విష్ చేయకుండా ఉంటుందా? ఇదిగో ఇలా కొంటెగా విషెస్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

‘‘అందమైన జంటకు పెళ్లి శుభాకాంక్షలు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవితాంతం కలిసి ఉండాలి. మొత్తానికి మీరు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి.. త్వరలోనే మీరు మీ ఇంటికి వెళ్తే.. మేం ఇక కన్‌స్ట్రక్షన్ సౌండ్స్ వినే బాధ తప్పుతుంది’’ అని తప ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. దీంతో అనుష్క ఫ్యాన్స్.. ఆమె కొంటె విషెస్ చూసి తెగ నవ్వేసుకుంటున్నారు. అంటే.. కత్రినా రోజూ విక్కీ ఇంటికి వచ్చేదా? అని అడుగుతున్నారు. మరి, అనుష్క విష్ చూసి.. క్యాట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెళ్లికి ముందు విక్కీ అందేరీలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని భావించాడు. అయితే, కత్రినాతో కలిసి జుహూలో అనుష్క ఇంటి పక్క ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. నెలకు రూ.8 లక్షలు చొప్పున రెంట్ చెల్లిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కొత్త ఇంటికి మారతారని సమాచారం. అయితే, ప్రస్తుతం అద్దెకు ఉన్న ఇంటికి విక్కీ, కత్రినా భారీ మొత్తమే చెల్లించారు. ఈ ఏడాది జులై నుంచి ఐదేళ్ల వరకు ఆ ఫ్లాట్ ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1.75 కోట్లు చెల్లించాడు. 

Also Read: 'న‌యీం డైరీస్‌'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 05:48 PM (IST) Tags: katrina kaif Anushka Sharma Vicky Kaushal కత్రినా కైఫ్ Katrina wedding విక్కీ కౌశల్ Anushka Wishes to Katrina

సంబంధిత కథనాలు

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Poonam Kaur: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసిన నటి పూనమ్ కౌర్

Poonam Kaur: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసిన నటి పూనమ్ కౌర్

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

టాప్ స్టోరీస్

Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం

Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం

Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!

Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

VLC Media Player Ban: వీఎల్‌సీ మీడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్

VLC Media Player Ban: వీఎల్‌సీ మీడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్