Guntur: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
అల్లుడు చేతిలో అత్త హత్యకు గురైనట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో సీతామహాలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది.
గుంటూరు జిల్లాలో ఓ అల్లుడు తన అత్తను చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతను తన అత్తను గడ్డ పారతో పొడిచి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. తన కుటుంబ సభ్యులపై నిందితుడు అనుమానం పెంచుకోవడం ఈ ఘాతుకానికి దారి తీసింది. గుంటూరు జిల్లాలోని పట్టాభిపురంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లుడు చేతిలో అత్త హత్యకు గురైనట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో సీతామహాలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మారుతీనగర్‌కు చెందిన కావూరి ఏసు అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సీతామహాలక్ష్మి అనే మహిళ తన కుమార్తె దానమ్మను సొంత తమ్ముడు అయిన ఏసుకు ఇచ్చి 22 సంవత్సరాల క్రితం పెళ్లి చేసింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం గత మే నెలలో ఆటో డ్రైవర్ అయిన ఏసు గాయపడ్డాడు. ఆయన కాలు విరగడంతో భార్య దానమ్మ తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి భర్తకు మెరుగైన చికిత్స చేయించుకుంది.
అయితే, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం భర్త ఏసులో మొదలైంది. ఈ వ్యవహారంలో భార్య దానమ్మను ఏసు నిత్యం వేధిస్తూనే ఉన్నాడు. రోజూ ఈ విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విషయాన్ని కుమారుడు సురేష్ అమ్మమ్మ సీతామహాలక్ష్మికి చెప్పాడు. తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని వచ్చి సర్ది చెప్పాలని పిలిచాడు. ఆమె వచ్చి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినా అల్లుడు ఏసు ప్రవర్తనలో ఏ మార్పూ రాలేదు. తల్లీ కుమార్తెలను ఇద్దరినీ అంతమొందించాలని ఏసు నిర్ణయించుకున్నాడు. వరండాలో నిద్రపోతున్న అత్త సీతామహాలక్ష్మి గొంతుపై చిన్న గడ్డ పార బలవంతంగా దాడి చేసి హత్య చేశాడు.
అనంతరం కట్టుకున్న భార్య దానమ్మను కూడా అదే విధంగా హత్య చేయాలని చూశాడు. కానీ, ఆమె అప్పటికే మేల్కొని కేకలు వేసింది. కుమారుడు సురేష్ కూడా మధ్యలో వెళ్లి అడ్డుపడి తల్లిని కాపాడుకున్నాడు. వెంటనే వెళ్లి ఆమె ఆమె పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి