News
News
X

Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు

సెలబ్రిటీల నుంచి పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు కొట్టేసిన శిల్పా చౌదరికి ఓ కేసులో బెయిల్ లభించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. శిల్ప బ్యాంక్ ఖాతా, కాల్ డేటా విశ్లేషిస్తున్నారు.

FOLLOW US: 
Share:

కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో సెలబ్రిటీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుమారు రూ.7 కోట్లు మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్‌ మంజూరు అయింది. మరో రెండు కేసుల్లో బెయిల్‌ రాలేదు. పోలీసుల విచారణలో భాగంగా శిల్పా చౌదరి బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో శిల్పా చౌదరికి ఉన్న ఖాతా వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. కానీ బ్యాంకు లాకర్‌లో పోలీసులకు ఏంలభించలేదు. సెలబ్రిటీల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్ప వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో మోసం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మోసం బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. 

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

సెలబ్రిటీలే టార్గెట్

హైదరాబాద్‌లో కిట్టి పార్టీల పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారు కేసులు పెట్టారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ తన భర్త పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిలా బిల్డప్ ఇస్తూ ప్రముఖులను మోసం చేసింది శిల్పా చౌదరి. తరచూ కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ సంపన్నులను టార్గెట్ చేసింది. సినిమా నిర్మాణం పేరుతో కోట్లు వసూలు చేసి నిండా ముంచేసింది. మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని తమ వద్ద రూ.2.90 కోట్లు మోసం చేసిందని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. హీరో హర్ష్ కనుమల్లి తనను శిల్పా చౌదరి మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు. తన వద్ద రూ.3 కోట్లు తీసుకుని ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  హర్ష్ కనుమల్లి ‘సెహరి’ సినిమాలో హీరోగా నటించాడు. శిల్పా చౌదరి బాధితుల్లో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉన్నారు. కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి ఫేక్ బంగారం, నకిలీ చెక్కులు అంటగట్టింది. హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని వద్ద రూ.2.90 కోట్లు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. చెక్కు మార్చేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శినికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు

పెట్టుబడుల పేరుతో మోసాలు

శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లా్లో నివాసం ఉంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్‌ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఎక్కడ అని అడిగితే ఏళ్లు గడుస్తున్నా మాట దాటవేస్తూ, బెదిరింపులకు దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: ముగిసిన శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ... రూ. 7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకారం..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 05:35 PM (IST) Tags: Hyderabad crime TS News Shilpa Chowdary Celebrities duped

సంబంధిత కథనాలు

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

టాప్ స్టోరీస్

Economic Survey 2023: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక - ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

Economic Survey 2023: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక - ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

Nayanthara: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్‌ కౌచ్‌ పై నయనతార షాకింగ్ కామెంట్స్

Nayanthara: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్‌ కౌచ్‌ పై నయనతార షాకింగ్ కామెంట్స్

IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం! 50కిపైగా బృందాలు రంగంలోకి

IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం! 50కిపైగా బృందాలు రంగంలోకి