Nervous father: తండ్రి కళ్లలో ప్రపంచం - పసిపాపను తొలిసారి అందుకున్న వేళ.. నెటిజన్లను కదిలిస్తున్న దృశ్యం!
Newborn to nervous father: బిడ్డ ఏ తండ్రికైనా అపురూపం. అప్పుడే పుట్టిన బిడ్డ అయితే చేతుల్లో తీసుకునే సందర్భం ఇంకా ప్రత్యేకం. అందుకే ఈ వీడియో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

Chennai doctor hands newborn to nervous father: సోషల్ మీడియా యుగంలో అప్పుడప్పుడు కొన్ని దృశ్యాలు భాషాభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి వీడియోనే ఇది.
తాజాగా చెన్నైకి చెందిన ఒక ప్రసూతి వైద్యురాలు పండంటి బిడ్డను తండ్రికి అప్పగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇప్పటివరకు 20 కోట్ల మంది చూశారు. ఈ వీడియో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన వీడియోల్లో ఒకటిగా నిలిచింది.
ఈ వైరల్ వీడియోలో, ఆసుపత్రి కారిడార్‌లో ఒక కొత్త తండ్రి తన బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా, కాస్త కంగారుగా వేచి చూస్తుంటాడు. అప్పుడే డాక్టర్ ఆ గది నుంచి బయటకు వచ్చి, పసిపాపను ఎంతో సున్నితంగా ఆయన చేతుల్లోకి ఇస్తారు. తన బిడ్డను మొదటిసారి చూసిన ఆ తండ్రి ముఖంలోని ఆనందం, ఒకింత భయం, భావోద్వేగం నెటిజన్లను కదిలిస్తున్నాయి. ఆ శిశువును ఎలా పట్టుకోవాలో తెలియక ఆయన పడుతున్న తడబాటు, పక్కనే ఉన్న డాక్టర్ నవ్వుతూ అతనికి ధైర్యం చెప్పడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
ఈ వీడియో వెనుక ఉన్న డాక్టర్ దీప్తి జమానీ, చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మధుర క్షణాలను షేర్ చేస్తూ.. ఒక కొత్త జీవితం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ తండ్రి కళ్లలో కనిపించే మెరుపును చూడటం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు అని పేర్కొన్నారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో, తండ్రి , బిడ్డల మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధానికి అద్దం పడుతోంది.
Holding a newborn… and realizing life just changed forever🫶🥹 pic.twitter.com/nsZfudXv4T
— Chutki Chaiwali🇮🇳 (@Chai_Angelic) March 9, 2026
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన దృశ్యం ఇది అని కొందరు అంటుంటే, ఆ తండ్రి కంగారు చూస్తుంటే నాకు నా మొదటి బిడ్డ పుట్టిన రోజు గుర్తొస్తోంది అని మరికొందరు తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తండ్రి ప్రేమకు అద్దం పట్టే ఇలాంటి సహజమైన దృశ్యాలు ఎంతటి కఠినమైన మనసునైనా కరిగిస్తాయని ఈ వీడియో నిరూపిస్తోంది.
Such a beautiful moment! A father meets his newborn child for the first time. 🥹
— भोले का दास (@ShamshanKiRakh) March 8, 2026
He doesn’t know what to do or how to hold the baby, overwhelmed with emotions.
Trending in India
सूर्या भाऊ Shivam Dube #INDvsNZ Kohli
General Category Sanju Samson pic.twitter.com/vceidGoLCZ
ప్రాణాలను కాపాడే డాక్టర్లు కేవలం చికిత్స మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో భావోద్వేగ క్షణాలకు సాక్ష్యులుగా నిలుస్తారని ఈ వీడియో గుర్తు చేస్తోంది. అందుకే ఈ వీడియో కేవలం వ్యూస్‌ని మాత్రమే కాదు, కోట్లాది మంది ఆశీస్సులను కూడా పొందుతోంది.
ట్రెండింగ్ వార్తలు























