Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు
దిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశాన్ని చుట్టేస్తోంది. దేశ రాజధాని దిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. 20 మందిలో 10 మంది ఇప్పటికే నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జ్ అయినట్లు తెలిపారు.
దిల్లీలో గురువారం నాలుగు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. వీరందరినీ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ రోగుల కోసం అంతకుముందు ప్రత్యేకంగా 40 పడకల వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని 100 పడకలకు పెంచినట్లు సత్యేంద్ర తెలిపారు. ఒమిక్రాన్ రోగుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.
దిల్లీ తొలి ఒమిక్రాన్ రోగి సోమవారం డిశ్ఛార్జ్ అయ్యారు. 37 ఏళ్ల రాంచీకి చెందిన ఈ వ్యక్తికి రెండు సార్లు కొవిడ్ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. టాంజానియా నుంచి దోహా వెళ్లి తర్వాత దిల్లీకి వచ్చాడు ఆ వ్యక్తి.
కొత్త నిబంధనల ప్రకారం ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారు ఎయిర్‌పోర్ట్‌లో కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఫలితాలు వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపుతారు.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న సాయంత్రానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు చేరింది. బంగాల్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. బంగాల్‌లో బుధవార ఉదయం తొలి కేసు నమోదుకాగా, తమిళనాడులో నిన్న సాయంత్రం నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు బుధవారం వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.
Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్
Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి