Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన అత్యాచార వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్త దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలు చేయడం ఒక తప్పైతే, ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామన్నట్లు స్పీకర్ నవ్వడం మరో తప్పు.
"అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమం".. ఏమనిపిస్తోంది ఈ మాటలు వింటే.. రక్తం ఉప్పొంగుతుంది కదా..! నరనరాన ఉరకలై పారుతోన్న రక్తం.. ఆ అమ్మ పాలతో తయారైంది కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచమైన సంస్కృతికి ఈ మాటలు నిదర్శనం కాదా? ఏటెళ్లిపోతోంది భారతం.. ఏమైపోతోంది దేశం?
ఆనాడు నిండు కొలువులో ద్రౌపదిని కించపరచి.. వస్త్రాపహరణం చేస్తుంటే.. సభ మొత్తం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. భీష్మ పితామహ, ద్రోణాచర్య, కృపాచార్య వంటి వారు తలవంచి మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనమే వారిని తరువాతి కురుక్షేత్ర మహాసంగ్రామంలో నామరూపాల్లేకుండా చేసింది.
మరి ఏకంగా చట్టాలు చేయాల్సిన సభలో, ప్రజా భవిష్యత్తును నిర్మించాల్సిన అసెంబ్లీలో ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్.. మహిళల గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వారించాల్సింది పోయి.. పకపకా నవ్వుతారా? ఏకంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఆ మాటలను ఆస్వాదిస్తుంటే ఏమనాలి? ఏటెళ్లిపోతోంది భారతం.. ఏమైపోతోంది దేశం?
ఎవరీ మహానుభావుడు!
ప్రస్తుతం ఈ కామెంట్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ కామెంట్ చేసిన వ్యక్తికి మాత్రం ఇది కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. ఆయన గురించి తెలుసుకుంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది.
రమేశ్ కుమార్.. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎందుకంటే అవి సాధారణ వ్యాఖ్యలు కాదు. మహిళా వ్యక్తిత్వాన్నే దెబ్బతిసేలా అందులోనూ చట్టసభలో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీరే చూడండి.
ఆస్వాదించండి..
కర్ణాటక అసెంబ్లీలో గురువారం రైతుల సమస్యలపై మాట్లాడేందుకు శాసనసభ్యులు.. స్పీకర్‌ను సమయం కోరారు. అందుకు ప్రతిగా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దే.. అందరికీ సమయం ఇచ్చుకుంటూ పోతే తాను సభను ఎలా నడపగలను అని అన్నారు.
ఆ వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
A day of pride for all Indians!
— Youth Against Rape ® (@yaifoundations) December 16, 2021
Our very own MLA mentions an old saying in an Assembly 'When rape is inevitable, lie down and enjoy it' & to this, some dignarities in the same room from where we seek 'just decisions and laws' are found laughing at this 'JOKE'! #KarnatakaAssembly pic.twitter.com/s704OUrNWy
నవ్విన సభ..
రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన స్పీకర్ సహా సభ్యులంతా గట్టిగా నవ్వారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. రమేశ్ కుమార్‌పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత చేసేదేం లేక.. క్షమాపణలు చెప్పారు రమేశ్ కుమార్.
I would like to express my sincere apologies to everyone for the indifferent and negligent comment I made in today’s assembly about “Rape!” My intention was not trivialise or make light of the heinous crime, but an off the cuff remark! I will choose my words carefully henceforth!
— K. R. Ramesh Kumar (@KRRameshKumar1) December 16, 2021
అంతకుముందు..
2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో కూడా రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో వివాదాస్పద ఆడియో టేపుల్లో తన పాత్రపై మీడియా ప్రశ్నలు అడుగుతుంటే రమేశ్ కుమార్ ఈ కామెంట్లు చేశారు.
యడియూరప్పపై..
2011లో అవినీతి ఆరోపణల కారణంగా సీఎం పీఠం నుంచి బీఎస్ యడియూరప్ప దిగిపోవాల్సి వచ్చింది. ఆ విషయం గురించి 2014లో అసెంబ్లీలో రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు
Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్
Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి