By: ABP Desam | Updated at : 18 Dec 2021 01:44 PM (IST)
అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్అయింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ మిస్సైల్‌ను పరీక్షించారు. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. దీని సామర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం. అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామర్థ్యం ఉన్నది. అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
అగ్ని ప్రైమ్ క్షిపణి.. రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ మిస్సైల్. డ్యుయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. మిస్సైల్‌లో ఉన్న అన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు సెకండ్ ఫ్లయిట్ టెస్ట్‌లో సరైన రీతిలో స్పందించినట్లు డీఆర్డీవో చెప్పింది. అగ్రి ప్రైమ్ క్షిపణి పరీక్ష సమయంలో.. టెలిమెట్రీ, రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ స్టేషన్స్, డౌన్‌రేంజ్ షిప్స్‌ను తూర్ప తీరం వద్ద ట్రాక్ చేశారు. అనుకున్నట్లే క్షిపణి ట్రాజెక్టరీ సాగిందని డీఆర్డీవో చెప్పింది. హై లెవల్ అక్యురెసితో అన్ని అబ్జెక్టివ్‌లను అందుకున్నట్లు డీఆర్డీవో వెల్లడించింది.
అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. దీంట్లో అధునాతన ఆధునిక సాంకేతికతను వినియోగించారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం సైనికులను ఆయుధాలను సమకూర్చే లక్ష్యంతో వివిధ క్షిపణీ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇప్పటికే బాలిస్టిక్, అగ్ని, పృథ్వీ క్షిపణీ వ్యవస్థలతో పాటు ఇవి కూడా చేరడంతో భారత్ రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది.
Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. క్షిపణి అద్భుతమైన రీతిలో పనిచేసినందుకు ఆయన అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి