Beer: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?
బీర్లు తాగి పొట్టలు పెంచితే అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
తెలుగుఇళ్లల్లో బీరు అనగానే అదేదో తాగకూడదని పానీయంలా చూస్తారు కానీ, చల్లని ప్రదేశాల్లో ఉన్న వారికి బీరు అతి సాధారణమైన డ్రింక్. శరీర ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు ఎక్కవమంది రాత్రయితే చాలు బీర్ బాటిల్ ఎత్తుతారు. కొంతమంది దాన్ని ఆల్కహాల్ అని ఒప్పుకోరు కూడా. అంతేకాదు బీర్‌ను కూల్ డ్రింక్‌తో సమానంగా భావించి తాగేస్తుంటారు. లైఫ్‌స్టైల్‌లో దాన్ని కూడా భాగం చేసుకున్నారు. బీర్ తాగడం మంచిదే అని సమర్థించుకున్నవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే బీరు తాగిన వారిలో పొట్ట పెరిగిపోతుంది. ఆ పానీయం తాగడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే బరువు పెరగడం గుర్తిస్తారు. కానీ కొంతమంది మాత్రం బీరు వల్ల బరువు పెరగమని అనుకుంటారు. అది కేవలం అపోహే అని కొట్టి పడేస్తారు.
బీరు తాగడం వల్ల పొట్ట పెరుగుతుందా?
బీరు తాగిన వెంటనే ఆ పానీయం అన్నవాహిక గుండా నేరుగా పొట్టలోకి జారిపోతుంది. తాగిన దానిలో 20శాతం ఆల్కహాల్ మీ పొట్ట నుంచి మీ రక్త ప్రవాహంలోకి సెకన్లలో కలిసిపోతుంది. మిగిలినదాన్ని మీ పేగులు పీల్చుకుంటాయి. బీరులో కూడా ఆల్కహాల్ కలిసి ఉంటుంది. ఆ ఆల్కహాల్ రక్తం ద్వారా కాలేయానికి చేరుతుంది. అక్కడ విచ్చిన్నమవుతుంది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో అసిటేట్, ఎసిటాల్టిహైడ్ అనే వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఈ వ్యర్థపదార్థాలు కొవ్వును కరగడాన్ని అడ్డుకుంటాయి. అదే సమయంలో మరొక వ్యర్థ పదార్థం ఎసిటైల్ CoA నుంచి కొవ్వు ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. రోజూ బీరు తాగేవారిలో పైన చెప్పిన ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొవ్వు కరగకపోవడంతో, కొవ్వు పేరుకుపోవడం కూడా జరుగుతుంది. దాని వల్ల కొన్నాళ్లకు బొజ్జ పెరిగిపెద్దదవుతుంది.
పొట్ట పెరగకుండా తాగడం ఎలా?
1. బీర్లలో లైట్, స్ట్రాంగ్ అని రెండు రకాలు ఉంటాయి. వాటిలో లైట్ బీర్‌నే ఎంచుకోండి. ఇందులో కేలరీలు కూడా తక్కువ ఉంటాయి.
2. బీర్ తాగడానికి ముందే ఎక్కవ నీళ్లు తాగేయండి. దీనివల్ల మీరు బీర్ అధికంగా తాగలేరు.
3. పొట్ట నిండా బీరు తాగి పడుకుంటే ఎవరికైనా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. తాగాక ఒక కిలోమీటరు దూరం నడవండి. దెబ్బకి కెలోరీలు కరిగిపోతాయి.
4. ఒకవేళ మీరు బీరు తాగడానికి సిద్ధపడితే... మిగతా ఆహారాన్ని తీసుకోవడం ఆరోజు తగ్గించండి. బీరుతో పాటూ బిర్యానీల్లాంటివి లాగిస్తే మీ పొట్టని ఆ దేవుడే కాపాడాలి. అంతలా పెరిగి పెద్దదవుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: కాఫీని ఇలా తాగితే బరువు తగ్గిపోతారు... ప్రయత్నించండి
Read Also: నిద్రలో మీకు ఈ రెండు సమస్యలు ఉన్నాయా... చాలా డేంజర్ అంటున్న కొత్త అధ్యయనం
Read Also: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?
Read Also: మొక్కజొన్న గింజలతో ఇంట్లోనే కార్న్ సూప్... తాగితే చలి పరార్
Read Also: చలికాలంలో చేపలు తినడం లేదా... తినాల్సిందే, తింటే ఎన్నిలాభాలంటే...
Read Also: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి