Corn Soup: మొక్కజొన్న గింజలతో ఇంట్లోనే కార్న్ సూప్... తాగితే చలి పరార్
కార్న్ సూప్ ఇంట్లోనే సులువుగా టేస్టీగా తయారుచేసుకోవచ్చు.
మొక్కజొన్నల సూప్ తాగాలంటే రెస్టారెంట్‌కే వెళ్లాలా? లేక రెడీ టు కుక్ ప్యాకెట్లు కొనుక్కుని తయారుచేసుకోవాలా? అవసరం లేదు తాజాగా మొక్కజొన్న గింజలతోనే వండుకోవచ్చు. చల్లని సాయంత్రం వేళ హాట్ హాట్ కార్న్ సూప్ తాగితే ఆ కిక్కే వేరప్పా. కార్న్ సూప్ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు రావు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
నీళ్లు - రెండు కప్పులు
మిరియాల పొడి - పావు టీస్పూను
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూను
అల్లం తరుగు - ఒ టీస్పూను
నెయ్యి - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి తగినంత
తయారీ ఇలా...
మొక్కజొన్న కండెలనుంచి ఒలిచి ఒక కప్పు గింజల్ని తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టి చిన్న మంట మీద నెయ్యి వేసి వేడిచేయాలి. వేడెక్కిన నెయ్యిలో జీలకర్ర వేయాలి. తరువాత అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. మొక్కజొన్న ముద్ద మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిరియాల పొడి కూడా చల్లాలి. ఇప్పుడు చిన్న మంట మీద పావుగంట సేపు ఉడకనివ్వాలి. మూత పెట్టద్దు. పొంగిపోయి బయటికే పోతుంది. మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. మీకు మంచి కార్న్ సూప్ వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి. నీళ్లు సరిపోలేదు అనిపిస్తే మధ్యలో కలుపుకున్నా ఫర్వాలేదు.
Read Also: చలికాలంలో చేపలు తినడం లేదా... తినాల్సిందే, తింటే ఎన్నిలాభాలంటే...
Read Also: మీ లవర్ మిమ్మల్ని దూరం పెట్టారా? కారణాలు ఇవి కావచ్చు
Read Also: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Read Also: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Read Also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?
Read Also: అంకాపూర్ దేశీ చికెన్ ఎందుకంత ఫేమస్.. రుచి చూశారంటే ఇక వదలరు..
Read Also: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి