Kids Height: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
పిల్లల ఎత్తు గురించి బెంగపడే తల్లిదండ్రులకు ఇది శుభవార్తే.
![Kids Height: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి If children want to grow taller, play games every day Kids Height: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/82ba94d913e19d3976ca40af53042923_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పొట్టిగా ఉండడాన్ని ఎవరు ఇష్టపడతారు. పొడవుగా ఉండాలనే కోరుకుంటారు. తల్లిదండ్రులైతే పిల్లల హైటు విషయంలో గాభారా పడుతూనే ఉంటారు. వారి వయసుకు తగ్గ హైటు ఉన్నారో లేదో అని కొలుస్తూనే ఉంటారు. ఆరడుగులు పెరగకపోయినా ఫర్వలేదు కానీ... మరీ అయిదడుగుల దగ్గర ఆగిపోతారేమో అని కంగారు పడుతుంటారు. అందుకే వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లల్ని రోజుకి ఓ గంట పాటూ ఈ ఆటలు ఆడిస్తే పొడవుగా పెరిగే అవకాశాలు పెరుగతాయిట. ఆటలు ఆడడం వల్ల ఎముకలతో పాటూ శరీరం మొత్తం స్ట్రెచ్ అవుతుంది. దాని వల్ల ఎంతో కొంత ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
1. బాస్కెట్ బాల్
ఈ ఆటలో జంపింగ్, రన్నింగ్, సెకన్లలో చిరుతలా ఇటూ అటూ కదలడం వంటి మూమెంట్స్ ఉంటాయి. కనుక పిల్లలు రోజూ బాస్కెట్ బాల్ ఆడితే మంచి ఫలితం ఉంటుంది.
2. బ్యాడ్మింటన్
ఎత్తు పెరిగేందుకు సహకరించే మరొక బెస్ట్ ఆట బ్యాడ్మింటన్. కార్క్ ని ఎగిరి కొట్టేటప్పుడు పిల్లల వెన్నుపూస స్ట్రెచ్ అవుతుంది. ఇది ఎత్తు పెరిగేందుకు కారణం అవుతుంది.
3. టెన్నిస్
బ్యాడ్మింటన్‌లాగే టెన్నిస్ కూడా. బాల్‌ని కొట్టేందుకు చేతిలో రాకెట్ తో చురుకుగా ఇటూ అటూ పరుగులు తీస్తారు. బాల్ ను అందుకునేందుకు ఎగిరికొడతారు. దీనివల్ల వెన్నుపూస సాగడంతో పాటూ, ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది.
4. ఈత
స్విమ్మింగ్ వల్ల కూడా పిల్లల శరీరం సాగి ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఈత వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది. ఇది మంచి ఎక్సర్ సైజ్ కూడా.
5. వాలీబాల్
బాస్కెట్ బాల్ లాగే వాలీబాల్లో కూడా జంపింగ్లు, రన్నింగ్లు ఎక్కువే. ఇవి త్వరగా హైట్ పెరుగేందుకు సహకరిస్తాయి.
6. స్కిప్పింగ్
ఇది మంచి కార్డియో ఎక్సర్‌సైజ్. అలాగే ఎత్తు పెరిగేందుకు పిల్లలు ఎంతో మంచి వ్యాయామం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read also: బొప్పాయి తింటే ఆరోగ్యమే కానీ... ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు
Read also: చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)