Sex Coffee: ఓ రొమాంటిక్ 'కాఫీ' ఇది.. తాగితే కథ వేరుంటది.. ఊ అంటావా మావా!
సరికొత్త కాఫీ ట్రెండ్ 2022ను కమ్ముకోబోతోందా? సెక్స్ కాఫీ రాబోతోందా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులకు ఓ అద్భుతమైన వార్త. సరికొత్త కాఫీ 2022లో ట్రెండవ్వబోతోంది. మీ మానసిక స్థితిని రొమాంటిక్ గా మార్చి, జీవితాన్ని ఆనందమయం చేస్తుందట ఈ కొత్త కాఫీ. అందుకే దీనికి ‘సెక్స్ కాఫీ’ అని పేరు పెట్టారు. అమెరికాలో తయారైన ఈ కాఫీ అక్కడ్నించి ఖండాలు దాటి ప్రయాణిస్తోంది. త్వరలో మన షాపుల్లో కూడా అమ్మే అవకాశాలు లేకపోలేదు. కామోద్దీపన సమ్మేళనంగా దీనికి పేరుంది. కొంతమంది కాఫీ ప్రియులు దీని విషయంలో ఆనందపడుతుంటే, మరికొందరు మాత్రం కోప్పడుతున్నారు. కాఫీ మూడ్ ఉల్లాసంగా, శరీరాన్ని చురుకుగా మారిస్తే చాలని, ఇలా కామోద్దీపనకారణిగా అవసరం లేదని వాదిస్తున్నారు.
ఏంటీ కాఫీ?
సాధారణ కాఫీతో పోలిస్తే దీని తయారీ కాస్త విభిన్నంగా ఉంటుంది. ఈ క్లాసిక్ కామోద్దీపన సమ్మేళనంలో కోకో, దాల్చినచెక్కతో పాటూ మకా అనే ఒక రహస్య పదార్థం కూడా కలుపుతారు. ఇదే శరీరంలో కోరికలను ప్రేరేపిస్తుంది. తాగాక మనుషుల ఆలోచనలు మారిపోతాయి. అందుకే ఈ కాఫీని ఎక్కడ పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని చెబుతున్నారు అనుభవం ఉన్నవారు.
మకా అంటే...
మకా అనేది ఒక కామోద్దీపన ఆహారం. ఇది దక్షిణ అమెరికాకు చెందినది. దీన్ని జింక్, సెలీనియం, విటమిన్ బి9, అయోడిన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో కలిపి చేస్తారు. అలాగే పెరువియాలో పండించే బ్రాసికా అనే మొక్క సారంతో దీన్ని ప్రధానంగా తయారుచేస్తారు. దీన్ని పెరువియన్లు సంప్రదాయంగా సెక్స్ కోరికలు పెంచుకునేందుకు వినియోగించేవారు. ఈ పదార్థం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని, సెక్స్ డ్రైవ్ ను పెంచుతుందని వారి నమ్మకం.
మగవారు, ఆడవాళ్లలో స్పెర్మ్, ఓవరీస్ నాణ్యతను పెంచడం ద్వారా సంతానోత్పత్తిని పెంచడానికి మకా పొడిని వాడతారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే చాలా శాస్త్రీయ పరిశోధనలు అవసరం.
తయారీ ఇలా...
ఒక చెంచా పచ్చి కోకో పొడి, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టీస్పూను తేనె, అర టీస్పూను దాల్చిన చెక్క, ఒక టీస్పూను మకా పొడి వేసి నీటిలో మరిగిస్తే బ్లాక్ కాఫీ సిద్ధం. మకా పొడి మన దేశంలో దొరుకుతుందో లేదో డౌటే.
Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి