Nizamabad: అంకాపూర్ దేశీ చికెన్ ఎందుకంత ఫేమస్.. రుచి చూశారంటే ఇక వదలరు..
నిజామాబాద్ ఫేమస్ అంకాపూర్ దేశీ చికెన్ డిష్ (Ankapur Deshi Chicken). ఈ డిష్ ఎందుకంత ఫేమస్ అయ్యింది. అంకాపూర్ టు అమెరికా పర్సిల్ అవుతున్న దేశీ చికెన్ టేస్ట్ రహస్యం ఇదే..
నిజామాబాద్ జిల్లాలో వేరీ వేరీ టేస్టీ డిష్ ఏదంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అంకాపూర్ దేశీ చికెన్ (Ankapur Deshi Chicken). ఇక్కడ ఎంతో ఇష్టంగా ఈ చికెన్ వంటకం ఆరగిస్తారు. అంకాపూర్ లో దాదాపు 35 ఏళ్ల నుంచి దేశీ చికెన్ కు భలే డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు అంకాపూర్ పేరు చెబితే అంత తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం ఈ గ్రామం ఆసియా ఖండంలోనే టాప్ విలేజ్. వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చిన గ్రామం ఇది. ఇక్కడ వ్యవసాయంతో కోట్లు గడించే రైతులు కూడా ఉన్నారు. వ్యవసాయంలో కొత్త వంగడాలు సృష్టించటంలో అంకాపూర్ రైతులు ఎప్పుడు ముందుంటారు. వ్యవసాయంతో ఈ ప్రాంతం ఎంత ఫేమస్ అయ్యిందో దేశీ చికెన్ తోనూ అదే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఇతర చోట్ల ఎక్కడ దేశీ చికెన్ తిన్నా ఆ టేస్ట్ రాదు మరి అంకాపూర్ లోనే ఎందుకింత ఫేమస్ అయ్యిందో ఈ వివరాలు మీకోసం..
అంకాపూర్ దేశీ చికెన్‌ను తినేందుకు భోజన ప్రియులు జిల్లా నుంచే కాక హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వస్తారు. స్పేషల్ గా వచ్చి ఇక్కడి దేశీ చికెన్‌ను ఓ పట్టు పడతారు. వీకెండ్స్ వచ్చాయంటే బ్యాచిలర్స్ బ్యాచులు బ్యాచులుగా తమ స్నేహితులతో కలిసి వచ్చి అంకాపూర్ దేశీ చికెన్ ను టేస్ట్ చేసి వెళ్తుంటారు. ప్రతి రోజు హైదరాబాద్ కు ఇక్కడి నుంచి లంచ్ సమయానికి పార్సిల్ వెళ్తుంటాయి. ప్రత్యేకంగా పార్సిల్ కోసం ఆర్టీసీ కార్గో కూడా ఉపయోగపడుతోంది. హైదరాబాద్ కే కాదండోయ్ గల్ఫ్ దేశాలకు, అమెరికాకు సైతం అంకాపూర్ దేశీ చికెన్ పార్సిల్ అవుతుందంటే ఆ టేస్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమయ్యే ఉంటుంది.
ఇంత టేస్ట్ రాటానికి కారణం ఇదే...
అంకాపూర్ దేశీ చికెన్ ను ఫుడ్ లవర్స్ ఎందుకంత ఇష్టపడతారంటే... ఇక్కడ దేశీ చికెన్ వంటలో విధానం, టేస్ట్ కోసం వాడే ఇంగ్రిడియన్స్ అంతా తాజాగా ఉంటాయి. దేశీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు. గ్రామాల్లో సహజంగా పెరిగే దేశీ కోళ్లను కోంటారు. ఫారం కోళ్లు కాకుండా తప్పనిసరిగా దేశీ కోళ్లనే వండుతారు. అంకాపూర్ లో దేశీ చికెన్ హోటళ్లు నిర్వహించేవారు ప్రత్యేకంగా దేశీ కోళ్లను పెంచుతారు. కూరలో వాడే మసాలాలు ఎప్పటికప్పుడు తయారు చేస్తారు. ధనియాలు, లవంగాలు, యాలికలు, కొబ్బరి పొడి, గసాల పౌడర్, డిష్ వండే సమయంలో రెడీ చేసి ఉంచుతారు. ముఖ్యంగా అల్లం వెళ్లుల్లి కూర వండే సమయంలోనే గ్రైండ్ చేస్తారు. ఆయిల్ ఫ్రెష్ గా ఉంటుంది.
Also Read: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?
మరో విషయం ఏంటంటే.. ఇక్కడ పండించే పసుపునే దేశీ చికెన్ వంటకంలో వాడతారు. కోడిని కోసిన తర్వాత ఫ్రేష్ గా కడిగి అందులో ముందుగా పసుపు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి యాడ్ చేసి కాసేపు ఉంచుతారు. వంట పాత్రలో ఆయిల్ వేసి కాసేపు మాగ్నేట్ చేసిన చికెన్ ను అయిల్ వేస్తారు. అలా కాసేపు ఉడికిన తర్వాత ప్రెష్ గా చేసుకున్న మసాలాలు కూర సరిపడా వేసుకుంటారు. అయితే ఏది కాస్త ఎక్కువైనా చికెన్ టేస్ట్ పోతుంది. వారు మాత్రం ఎలాంటి మెజర్ మెంట్ ఉపయోగించరు. కేవలం చేతితోనే సుమారుగా అవసరానికి అనుగుణంగా వేస్తారు.
అంకాపూర్ దేశీ చికెన్‌లో వాడే కొత్తుమీర రుచిని మరింత పెంచుతుంది. ఎందుకంటే కొత్తిమీర, పుదినా అక్కడే పండిస్తారు. ఇలా మసాలాలు వేశాక దాదాపు 30 నిమిషాలు పాడి చికెన్ ఉడికిస్తారు. అంతే సింపుల్ అంకాపూర్ దేశీ చికెన్ రెడీ... మీకు ఆ టేస్ట్ రావాలంటే జస్ట్ ఇలా ట్రై చేసి చూడండి.. కానీ మసాలాలు, కారం, ఉప్పు వేసేటపుడు సరిపడా వేస్తేనే అంకాపూర్ టేస్ట్ ను ఆస్వాదించవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అంకాపూర్ పేరుతో హైదరాబాద్ లో కూడా ఎన్నో చికెన్ వంటకాలు చేసే హోటళ్లు ఉన్నాయ్. కానీ రియల్ టేస్ట్ మాత్రం అంకాపూర్ లోనే ఉంటుందని భోజన ప్రియులు చెబుతారు.
Also read: చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Also read: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం