News
News
X

UnHealthy Habits: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం

పడుకోబోయే ముందు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.

FOLLOW US: 

రాత్రి సరిగా నిద్రపట్టకపోతే ఆ ప్రభావం ఉదయం తింటి నుంచి పని వరకు ప్రతి పనిపైనా  పడుతుంది. అందుకే ప్రశాంతమైన, చక్కటి నిద్ర అందరికీ అవసరం. అంతేకాదు రోజు ఎనిమిది గంటలు కూడా నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిరకాల అలవాట్ల వల్ల రాత్రి నిద్ర చెడిపోతోంది. ఆ అలవాట్లను దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

1. కాఫీలు తెగ తాగడం
కొందరు కాఫీలకు, టీలకు బానిసలైపోతారు. ఎవరైనా కావాలా అని అడగడం పాపం తీసుకుని గడగడ తాగేస్తారు. కెఫీన్ అధికంగా వీటి వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇవి మెదడుపై స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ ను ఎక్కువ చూపిస్తాయి. దీంతో మెదడు అలర్ట్ అయిపోతుంది. నిద్రను ఆలస్యం చేస్తుంది. 

2. బింగే ఈటింగ్
నోటికి అడ్డు అదుపులేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ ఉండడం. ఓటీటీలో సినిమా పెట్టుకోవడం ఒకటే తినడం ఇది చాలా మంది చేసే పని. ఎంత తింటున్నామో కూడా తెలియకుండా ఏదో ఒకటి నిత్యం తినడాన్నే బింగే ఈటింగ్ అంటారు. రాత్రి సినిమాలు చూస్తూ అర్థరాత్రి వరకు పడుకోకపోవడం కూడా నిద్రా వ్యవస్థను దెబ్బతీస్తుంది. 

3. రాత్రి ఆకలి
రాత్రి సరిగా తినకుండా నిద్రపోవడం, అర్థరాత్రి ఆకలితో మేల్కోవడం పద్దతి కొనసాగినా మంచిది కాదు. ఇలాగే కొనసాగితే నిద్రపోయే సమయానికి ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మొదలవుతాయి. 

4. అస్థిరమైన నిద్రవేళలు
కొందరు రాత్రి ఒకే టైమ్‌కే నిద్రపోరు. ఓరోజు తొమ్మిది గంటలకు, మరోసారి పది గంటలకు, ఇంకోసారి 12 గంటలకు ఇలా నచ్చినట్టు నిద్రపోతారు. ఇలా అస్థిరమైన నిద్రవేళలు మంచివి కావు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఉత్తమం. 

5. నిద్రపోయే ముందు బ్రషింగ్
రాత్రి పడుకునే ముందు పళ్లను కనీసం రెండు నిమిషాల పాటూ బ్రష్ చేసుకోవాలి. నోటి శుభ్రత లేకపోయినా కూడా సరిగా నిద్రపట్టదు. నోటిలోని బ్యాక్టిరియాల పొట్టపై కూడా ప్రభావం చూపిస్తుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  

Read also: బొప్పాయి తింటే ఆరోగ్యమే కానీ... ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు

Read also:  చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు

Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Dec 2021 05:28 PM (IST) Tags: Sleeping Bad habits sleep deprivation స్లీపింగ్

సంబంధిత కథనాలు

Skin Care: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్

Skin Care: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్

Mosambi : ఈ ప్రయోజనాలు పొందాలంటే బత్తాయి తినాల్సిందే

Mosambi : ఈ ప్రయోజనాలు పొందాలంటే బత్తాయి తినాల్సిందే

Crime Thrillers: క్రైమ్ థ్రిల్లర్‌లను ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు!

Crime Thrillers: క్రైమ్ థ్రిల్లర్‌లను ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు!

Survey Report: ఇండియన్ పైలట్లలో 66 శాతం మంది అలాంటి వారేనట! తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

Survey Report: ఇండియన్ పైలట్లలో 66 శాతం మంది అలాంటి వారేనట! తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

Ants Weight in Earth: ఈ భూమ్మీద ఎన్ని చీమలు ఉన్నాయి? వాటి మొత్తం బరువు ఎంతో మీకు తెలుసా !

Ants Weight in Earth: ఈ భూమ్మీద ఎన్ని చీమలు ఉన్నాయి? వాటి మొత్తం బరువు ఎంతో మీకు తెలుసా !

టాప్ స్టోరీస్

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

YSRCP WorkShop : ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ - నేరుగా ఇచ్చేసిన జగన్ ! వారెవరంటే ?

YSRCP WorkShop :  ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ -  నేరుగా ఇచ్చేసిన జగన్ !   వారెవరంటే ?

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

AP Vs Telangana :  విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?