(Source: ECI/ABP News/ABP Majha)
Omicron: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?
ఒమిక్రాన్ ఒక్కొక్కరిగా అంటుకుంటూ థర్డ్ వేవ్ వైపుగా ప్రయాణం చేస్తోందా?
మనదేశంలో ఒమిక్రాన్ రెండు కేసులతో మొదలై ఇప్పుడు రోజురోజుకు సంఖ్య పెరిగిపోతోంది. ఈ వేరియంట్ ను అంత తక్కువగా అంచనా వేయలేం. బ్రిటన్లో ఇది సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. ఇప్పటికే మనదేశంలో 111 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. మనదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు పెరగడంతో, చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. అలా డోసులు పూర్తయిన వారంతా తాము ఒమిక్రాన్ నుంచి సురక్షితులమని భావిస్తున్నారు. కానీ ఆ అభిప్రాయం సరైనది కాదని ఒమిక్రాన్ కేసులు నిరూపిస్తున్నాయి.
ఈ విషయంపై అమెరికాలోని పల్మనాలజిస్టు డాక్టర్ విన్ గుప్తా మాట్లాడుతూ ‘రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వ్యక్తులకు కొత్త వేరియంట్ రాదన్న భరోసా ఏమీ లేదు. కాకపోతే తీవ్రమైన అనారోగ్యం పడే అవకాశం తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా మారి ఆసుపత్రిలో చేరేంత స్థాయికి చేరవు’అని వివరించారు. దీన్ని బట్టి కొత్త వేరియంట్ తమకు రాదన్న ధీమాను వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రజలు వదిలేసి, జాగ్రత్తగా ఉండాలి.
సాధారణ స్క్రీనింగ్లు, మెరుగైన పరీక్షలతో వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి అధికారులు అన్ని కోవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొత్త కేసులు బయట పడుతున్నాయి. ఎటువంటి ప్రయాణాలు చేయని వ్యక్తులు కూడా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది సోషల్ డిస్టెన్స్ లేని కారణంగా వ్యాప్తిస్తున్నట్టు భావిస్తున్నారు అధికారులు.
భయపడాలా?
జనాభాలో చాలా మందికి టీకాలు వేయడంతో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అంత త్వరగా సాగదని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అలాగే వ్యాక్సిన్ల కారణంగా ప్రజల్లో ఉండే యాంటీబాడీలు ఈ వేరియంట్ తీవ్రంగా ఆరోగ్యాన్ని చెడగొట్టకుండా కాపాడే అవకాశం ఎక్కువ.
బూస్టర్ డోస్ అవసరమా?
ప్రస్తుతం చాలా మంది పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు భారతదేశంలో బూస్టర్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోస్ అవసరమనే ప్రచారం జరిగింది. అలాగే యాంటీ బాడీలు క్షీణిస్తున్న వార సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరందరూ బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకు బూస్టర్ డోస్ అవసరమా లేదా అన్నది ప్రభుత్వం తేల్చలేదు.
Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి