(Source: ECI/ABP News/ABP Majha)
New Study: నిద్రలో మీకు ఈ రెండు సమస్యలు ఉన్నాయా... చాలా డేంజర్ అంటున్న కొత్త అధ్యయనం
నిద్రకు సంబంధించిన సమస్యలు వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు.
కొందరిలో నిద్ర ఎంతకీ పట్టదు. కళ్లకింద నల్లటి వలయాలు వచ్చేస్తాయి. ఎప్పుడో అర్థరాత్రి దాటాక నిద్రపోతారు. అది కూడా రెండు మూడు గంటలు మాత్రమే. దీన్నే నిద్రలేమి అంటారు. అలాగే మరో నిద్రసంబంధ సమస్య ‘అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’. నిద్ర మధ్యలో శ్వాస అందక ఏర్పడే ఓ రుగ్మత. ఇది నిజానికి కాస్త ప్రమాదకరమైనదే. గురకపెడుతూ మధ్యలో హఠాత్తుగా లేచిపోతుంటారు. దానికి కారణం ఇది కూడా కావచ్చు. అయితే నిద్రలేమి, అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్యలు రెండూ ఒకే వ్యక్తిలో కలిగే అవకాశాలు ఎక్కువే. ఇలా ఈ రెండూ ఒకే వ్యక్తికి కలిగితే మాత్రం అతడు గుండె సంబంధ సమస్య బారిన పడే అవకాశం పెరుగుతుందని తేల్చింది కొత్త అధ్యయనం. కార్డియాక్ అరెస్టు వంటి వాటి బారిన పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతోంది. చనిపోయే అవకాశాలు కూడా అధికమేనని చెడుతోంది పరిశోధన. అందుకే ఈ రెండు లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ అధ్యయనం ఫలితాలు ‘యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్’లో ప్రచురించారు.
ఇప్పటికే చాలా మందిలో...
నిద్రలేమి, అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనేవి రెండు సాధారణ నిద్ర రుగ్మతలు. ఇవి ప్రస్తుత జనాభాలో 10 నుంచి 30 శాతం మందిలో ఉండొచ్చు. వీరిలో కొంతమంది రెండు రుగ్మతలతోనూ బాధపడొచ్చు అని అంచనా వేశారు పరిశోధకులు. ఫ్లిండర్స్ విశ్వ విద్యాలయ పరిశోధకులు ఈ రెండు నిద్ర రుగ్మతలు కల 5000 మందిపై అధ్యయనం చేశారు. వారిని గత పదిహేనేళ్లుగా గమనిస్తూ వచ్చారు. వారిలో 1210 మంది మరణించినట్టు గుర్తించారు. ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో అధికరక్తపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉందని, అలాగే 70 శాతం గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉందని ఫలితాలు వెల్లడించాయి. అలాగే ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో మరణించే శాతం 47 శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధనా ఫలితం తేల్చింది.
ఈ రెండు నిద్రరుగ్మతలు ఉన్నవారిలో అధికంగా మరణాల శాతం పెరగడానికి కారణమయ్యే విషయాన్ని పరిశోధించడానికి మరింత పరిశోధన అవసరం అని అధ్యయనకర్తలు చెప్పారు. అలాగే వీటిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధరించడానికి కూడా మరింత లోతైన పరిశోధన అవసరమని తెలిపారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Read Also: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Read Also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?
Read Also: అంకాపూర్ దేశీ చికెన్ ఎందుకంత ఫేమస్.. రుచి చూశారంటే ఇక వదలరు..
Read Also: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?