Republic Day 2025 : గణతంత్ర దినోత్సవం Vs స్వాతంత్య్ర దినోత్సవం - ఈ రెండు రోజుల్లో జెండా ఎగురవేయడంలో ఉన్న తేడా ఇదే..!
Republic Day 2025 : దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

Republic Day 2025 : దేశంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 26, 2025 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తోంది. వాస్తవానికి, నవంబర్ 26, 1949న రాజ్యాంగానికి ఆమోదం లభించింది. ఆ తరువాత జనవరి 26, 1950 న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అనంతరం భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. ఈ రోజును స్మరించుకునేందుకే దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఈ రోజున భారత రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.
దేశానికి రెండు ప్రభుత్వ పండుగలు ఉంటాయి. అందులో ఒకటి గణతంత్ర దినోత్సవం, మరొకటి స్వాతంత్ర్య దినోత్సవం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం (Republic Day) అని జనవరి 26న, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని స్వాతంత్ర్య దినోత్సవం (Independance Day)గా ఆగస్టు 15న జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. అయితే ఈ 2 రోజులూ ఒకేలా అనిపించినప్పటికీ కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తాయి. ఆయా రోజుల్లో వేర్వేరు పదవుల్లో ఉన్న వ్యక్తులు జాతీయన జెండాను ఎగురవేయడం సంప్రదాయంగా వస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తే, స్వాతంత్ర్య దినోత్సవానికి మాత్రం ప్రధాన మంత్రి జెండాను ఎగురవేస్తారు. దేశానికి రాష్ట్రపతి అధిపతి అయితే, కేంద్రానికి మాత్రం ప్రధానమంత్రి అధిపతిగా ఉంటారు. అయితే రెండు రోజుల్లో ఎవరు జెండాను ఎగురవేసినప్పటికీ ప్రజలు మాత్రం రెండింటినీ ఒకేలా భావిస్తూ ఉంటారు. కానీ ఈ విషయాల్లో చాలా తేడా ఉంది. అదేంటంటే.. ఆగస్టు 15న జెండాను ఎగురవేస్తాం. జనవరి 26న జెండాను ఆవిష్కరిస్తాం.
ఎగురవేయడం - ఆవిష్కరించడం.. తేడాలివే
రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంలో ఒక తేడా ఉంటుంది. గణతంత్ర దినోత్సవం రోజు త్రివర్ణ పతాకాన్ని మడిచి లేదా చుట్టి, కర్రపై భాగాన కడతారు. రాష్ట్రపతి ఈ రోజున ఒక దారంతో దాన్ని లాగి విప్పుతారు. దీన్ని జెండాను ఎగురవేయడం అంటారు. ఆంగ్లంలో దీనిని Flag Unfurling అంటారు.
అదే సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవం రోజు త్రివర్ణ పతాకాన్ని కింది నుంచి పైకి లాగుతారు. దీన్ని జెండా ఎగురవేయడం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే త్రివర్ణ పతాకం కింది నుంచి స్తంభం పైభాగానికి వెళ్లి రెపరెపలాడేలా చేయడమన్నమాట. దీన్ని జెండాను ఆవిష్కరించడం అంటారు. ఈ రోజున జెండాను ఓ తాడు సహాయంతో కింది నుండి పైకి లాగుతారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఈ జెండాను ఎగురవేస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో flag hoisting అంటారు.
రెండింటికి అర్థం ఏమిటంటే..
జెండాను ఎగురవేయడం అనేది మన దేశం రాజ్యాంగంలోని సూత్రాలు, నియమాల పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తుంది. భారతదేశం బ్రిటీష్ వారి బారి నుండి స్వతంత్రం పొందడం, సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారడాన్ని కూడా ఇది చూపిస్తుంది. అదే సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయడం కొత్త దేశం ఆవిర్భావానికి ప్రతీక. జెండా ఎగురవేయడం అనేది వలస పాలన నుంచి మనకు లభించిన స్వేచ్ఛకు నిదర్శనంగా కూడా నిలుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

