Jayalalitha Properties: పదివేల చీరలు, 750 జతల చెప్పులు సహా 4వేల కోట్ల ఆస్తి - జయలలిత ఆస్తులు వాళ్లకే
Jayalalitha: జయలలిత ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఆ ఆస్తులు తమకు ఇవ్వాలన్న దీప, దీపక్‌ల విజ్ఞప్తిని బెంగళూరు కోర్టు తిరస్కరించింది.

Jayalalitha assets are handed over to the Tamil Nadu government: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వనికి అప్పగించాలని బెంగళూరు కోర్టు నిర్ణయించింది. 1562 ఎకరాల భూమికి సంబంధించిన భూపత్రాలతో పాటు 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పదివేలకు పైగా చీరలు, 750 కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులు బెంగళూరు కోర్టు కస్టడీలో ఉన్నాయి. వీటి విలువ సుమారు నాలుగు వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. గతంలో అక్రమాస్తుల కేసుల విచారణను తమిళనాడు నుంచి బెంగళూరుకు మార్చినప్పుడు ఈ పత్రాలన్నీ ఆ కోర్టుకు తరలించారు. అక్కడి కోర్టే విచారణ జరిపింది. జయలలిత మరణానంతరం తీర్పు వచ్చింది. శశికళ శిక్ష అనుభవించారు. ఆమె ఆస్తులు ఆమెకు ఇచ్చేశారు.
జయలలిత మరణించడంతో ఆమె ఆస్తులు ఎవరికి ఇవ్వాలన్నదానిపై వివాదం కోర్టులో వాదనలు జరిగాయి. ఆమె ఆస్తులు తమకు దక్కుతాయని జయలలిత బంధువులుగా ప్రకటించుకున్న జె.దీప, జె.దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు చేసిన క్లెయిమ్ ను కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలో సుమారుగా 140కి పైగా సినిమాలలో నటించిన జయలలిత పలు రాష్ట్రాలలో ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి.
Also Read: Budget 2025: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్ ముందు వీటి తేడాలు తెలుసుకోండి
అయితే ఇవన్నీ అక్రమాస్తుల కేసులో సీజ్ చేసిన ఆస్తులే. సీజ్ చేయని ఆస్తులను పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని దీప, దీపక్‌లకు గతంలో తమిళనాడు న్యాయస్థానం ఇచ్చేసింది. జయలలిత మరణం తర్వాత పోయెస్ గార్డెన్ తమకే దక్కుతుందని న్యాయ పోరాటం చేసి మరి అమ్మ నివాసమైన వేద నిలయాన్ని దక్కించుకున్నారు జయలలిత వారసులు . వారిద్దరూ పోయెస్ గార్డెన్ ను 2021లోనే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని జయలలిత స్మారకంగా మారుస్తామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. అయితే న్యాయస్థానం మెరీనా బీచ్ లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని, ఇప్పుడు మరోది ఎందుకని ప్రశ్నించింది. ఇప్పటికే మెరీనా ( వెంబడి జయలలితకు 80 కోట్ల విలువైన స్మారక చిహ్నం ఉంది. 80 కోట్ల మెరీనా మెమోరియల్ అందించని స్పూర్తిదాయకమైన కథ వేదనిలయంలో ఏముంది అని ప్రశ్నించిన హైకోర్టు.. వారసులకు ఆస్తి హక్కును కల్పించింది.
జయలలిత చనిపోయిన సమయంలోనే ఈ దీప, దీపక్ తెరపైకి వచ్చారు. జయలలిత సోదరుడి పిల్లలం అని క్లెయిమ్ చేసుకున్నారు. కొన్ని ఆధారాలు సమర్పించడంతో కోర్టు ఇచ్చంది. అయితే అక్రమాస్తుల కేసుల్లో ఉన్న ఆస్తులను మాత్రం ప్రభుత్వానికే ఇస్తూ బెంగళూరు కోర్టు నిర్ణయం తీసుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

