(Source: ECI/ABP News/ABP Majha)
Noel Tata: నోయెల్ టాటానే రతన్ టాటా వారసుడా? టాటా ట్రస్ట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
Ratan Tata: రతన్ టాటా మృతితో అందరిలో ఒకటే ప్రశ్న. టాటా ట్రస్ట్‌ను నడిపించే నాయకుడు ఎవరు అనే ఆసక్తి నెలకొంది. టాటా ట్రస్ట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.
Ratan Tata: భారతమాత ముద్దుబిడ్డ, ప్రజలు మెచ్చిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం తర్వాత అందరిలో ఒకటే చర్చ. రతన్ టాటా వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు? అతని సామ్రాజ్యానికి వారసులు ఎవరు? అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది. 86 ఏళ్ల వయసులో రతన్ టాటా రెండు రోజుల క్రితం మృతి చెందారు. అక్టోబర్ 10న ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. అశ్రునయాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఆయన మృతిపై దేశంతోపాటు ప్రపంచం నలుమూలల ప్రముఖులు ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.
రతన్ టాటా వారసుడిని నియమించడానికి టాటా న్యాసా (టాటా ట్రస్ట్) ముఖ్యమైన సమావేశం జరుగుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం టాటా ట్రస్ట్ తదుపరి అధిపతి నియామకంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ట్రస్టు అధిపతి పదవికి రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా పేరు వినిపిస్తోంది.
గోయల్ టాటాకు 66 శాతం
టాటా ట్రస్ట్ అధినేతగా నోయల్ టాటాను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై టాటా ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బాంబే హౌస్‌లో ఈ చర్చ జరుగుతుంది. నోయల్ టాటా ప్రస్తుతం సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లో ట్రస్టీగా ఉన్నారు. టాటా సన్స్‌లో ఆయనకు 66 శాతం వాటా ఉంది. కాబట్టి టాటా ట్రస్ట్‌ను విజయవంతం నడిపేందుకు నోయల్ టాటా పూర్తి అర్హత ఉందనే వాదన ఉంది.
రతన్ టాటా నిష్క్రమణం తర్వాత టాటా సన్స్ భారీ సామ్రాజ్యాన్ని ఆ దిశానిర్దేశం చేస్తారనే వాదన బలంగా ఉంది. రతన్ టాటాకు వ్యాపార దక్షతతోపాటు దాతృత్వం కూడా ఉంది. ఇప్పుడు ఎవరు ఆ బాధ్యతలు తీసుకున్నా ఆ వ్యక్తిలో అవి కూడా ఉండాలని అంతా అనుకుంటారు. ఆ విషయాన్ని ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
టాటాకు నోయెల్ సవతి సోదరుడు
నావల్ టాటా సోనీ దంపతులకు పుట్టిన బిడ్డే రతన్ టాటా. ఈ దంపతులు 1940లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా కలిగిన బిడ్డే నోయెల్ టాటా (Noel Tata). రతన్ టాటాకు పెళ్లి పిల్లలు లేనందున విలువైన ఆస్తికి ఇప్పుడు సవతి సోదరుడు నోయెల్ టాటా కాని ఆయన సంతానం కాని పెద్ద దిక్కుకానుంది.
సవతి సోదరుడు నోయెల్ టాటాకు ముగ్గురు సంతానం. వారు మాయా టాటా (Maya Tata), నెలిల్లే టాటా (Neville Tata), లియా టాటా (Leah Tata). వాళ్లు కూడా టాటా సంస్థల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.
మాయా టాటా(Maya Tata:)
మాయా టాటా కెరీర్‌ను టాటా ఆపర్చునిటీ ఫండ్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత టాటా డిజిటల్‌లోకి వచ్చారు. టాటా న్యూ యాప్‌ను అభివృద్ధి చేయడంలో, లాంచ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె తన సోదరితో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు.
నెవిల్లే టాటా(Neville Tata)
మాయా టాటా బ్రదర్ నెవిల్లే టాటా ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. జూడియో, వెస్ట్‌సైడ్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను పెళ్లి చేసుకున్నారు.
లియా టాటా (Leah Tata)
టాటా గ్రూప్‌లోని లియా టాటా హోటల్ వ్యాపారంలో పని చేశారు. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.