Sandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
స్పిరిట్ తో ప్రభాస్ రూత్ లెస్ కాప్ గా చూపిస్తానని మాటిచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈలోపు సంక్రాంతి వచ్చింది. మరి ఈ వరంగల్ కుర్రోడు ఏం చేస్తాడు. అందుకే దోస్తుగాళ్లతో కలిసి పతంగులు ఎగరేస్తూ రచ్చ చేశాడు. అది కూడా మాములుగా ఎగరేయటం కాదు పోటీనే. ఎవడో గాలిపటం కోసేసి కాటే అంటూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. లాస్ట్ ఇయర్ మీదే స్పిరిట్ స్టార్ట్ కావాల్సి ఉన్నా ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్స్ ఆలస్యం కావటంతో ఈ సినిమా ప్రారంభం కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్...ప్రభాస్ ను యానిమల్ ను మించిన క్రూయల్ గా వయొలెంట్ గా చూపిస్తాడని ఫ్యాన్స్ అయితే ఫుల్ హోప్స్ తో ఉన్నారు స్పిరిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















