Flyover Iron Rods Theft | హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పైనుంచి దూకేసిన వ్యక్తి | ABP Desam
తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఫలక్‌నామాకు చెందిన 55 ఏళ్ల రాములు అంబర్‌పేట రమణ చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్‌పైకి ఎక్కి, ఆ ఫ్లైఓవర్‌లో ఉన్న ఐరన్ రాడ్లను విరగగొట్టి అమ్మేందుకు ప్రయత్నించాడు.రాడ్లను వంచే క్రమంలో రాములు అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనను నిర్మాణ కూలీలు గమనించి అరిచారు. అప్పటికే రాములు మత్తులో ఉండటంతో అదుపు తప్పి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములు ఫ్లైఓవర్‌పైకి ఎలా ఎక్కాడు, దొంగతనానికి ఎందుకు ప్రయత్నించాడు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాములు దొంగతనానికి ప్రయత్నించటం అక్కడి నుంచి జారి పడిపోయిన విజువల్స్ ను స్థానికులు సెల్ పోన్ లో తీయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.





















