KTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP Desam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఫార్మూలా ఈ కార్ రేస్ లో అవతకవలపై తనపై నమోదైన ఏసీబీ, ఈడీ కేసులను క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. కేసు వాదనకు తీసుకుంటే తమ అభిప్రాయం కూడా వినాలని ఏసీబీ కేవియట్ పిటీషన్ కూడా వేసింది. ఈరోజు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ...ఆల్రెడీ ఈ కేసులో తమ జోక్యం ఉండదని క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసిన తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఏసీబీ విచారణకు అంతరాయం కలిగించలేమని..ఈ కేసులో హైకోర్టు నిర్ణయం సమర్థనీయమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్నవరాలే లు తేల్చి చెబుతూ...క్వాష్ పిటీషన్ ను తోసిపుచ్చటంతో కేటీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటీషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఈ నిర్ణయంతో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అంటూ మళ్లీ వాదనలు మొదలు అయ్యాయి





















