అన్వేషించండి

Car Parking: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? - కచ్చితంగా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే!, మహారాష్ట్ర ప్రభుత్వం న్యూ రూల్

Maharastra News: వాహనాల రద్దీ అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికే కొత్త కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.

Maharastra Government Will Implement New Rule For Car Parking: మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టేందుకు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇకపై కొత్త కార్లు కొనాలనుకునే వారికి తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఉండాలని తెలిపింది. పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికే కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పారు.

కాగా, నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ కార్లను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు సైతం ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికే కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలనే నిబంధన పెట్టినట్లు మంత్రి సర్నాయక్ తెలిపారు.

త్వరలోనే అమలు

ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో చర్చిస్తున్నామని మంత్రి సర్నాయక్ చెప్పారు. 'ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని మేం చెప్పట్లేదు. అయితే, దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలు సైతం ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు అవసరం. ట్రాఫిక్ అదుపు చేసేందుకు ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా అదనంగా ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ ట్యాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం.' అని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Embed widget