Mahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP Desam
ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా కన్నులపండువలా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే మూడున్నర కోట్ల మంది గంగ,యమున, సరస్వతీ నదుల సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలను ఆచరించి హరహరమాహాదేవ అంటూ శివుడిని స్మరించుకున్నారు. మొదటి రోజు కోటి 65లక్షల మంది భక్తులు రాగా రెండో రోజు ఏకంగా మూడున్నర కోట్ల మంది మహాకుంభమేళాకు తరలిరావటంతో ప్రయాగ మొత్తం హర నామస్మరణతో మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత సైన్యం అడుగడుగునా పహారా కాస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి నాగా సాధువులు, అఘోరాలు పవిత్ర పుణ్యస్నానాల కోసం తరలిరావటంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓం నమ:శివాయ అంటూ గుర్రాలపై స్వారీ చేస్తూ నాగా సాధువులు పవిత్ర స్నానం కోసం వచ్చే దృశ్యాలు ఆధ్యాత్మిక పారవశ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమృత స్నానాల కోసం వస్తున్న యోగులు, బుుషులు, భక్తులను గౌరవించుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెలికాఫ్టర్ తో భక్తులపై పూలు చలిస్తూ గౌరవిస్తోంది.





















