Sankranti kites: ఎక్కడ చూసిన గాలిపటాల సందడి- ఆకాశంలో కాగితపు హరివిల్లు
Sankranti Celebrations: సంక్రాంతి వచ్చిందంటే చాలు సందడి మొదలువుతుంది. భోగిమంటలు, రంగవల్లులు, పిండివంటలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.
New Types Of Kites In Market: సంక్రాంతి(Sankranti) వచ్చిందంటే చాలు సందడి మొదలువుతుంది. భోగిమంటలు, రంగవల్లులు, పిండివంటలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. రంగు రంగుల గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. పండగపూట చిన్నా... పెద్దా తేడాలేకుండా అందరూ పోటాపోటీగా గాలిపటాలు(Kites) ఎగురవేస్తుంటారు. వారిని ఆకట్టుకునేలా ప్రతి ఏటా సరికొత్త గాలిపటాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పండుగను పురస్కరించుకుని మార్కెట్లు రకరకాల రంగుల గాలిపటాలతో కళకళలాడుతున్నాయి.
కాదేదీ గాలిపటానికి అనర్హం
ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు, రాజకీయ నాయకులు, పార్టీల చిహ్నాలతో కూడిన గాలిపటాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేరుతో కూడా మార్కెట్‌లో గాలిపటాలు ఉన్నాయి. అలాగే సలార్, చోటాభీమ్, యాంగ్రీబర్డ్స్, బార్బీ గర్ల్, టామ్ అండ్ జెర్రీ, ఫ్రాజాన్, హెల్లో కిట్టీ, డోరోమ్యాన్, ఐ లవ్ ఇండియా, మోటూపత్లూ, స్పైడర్‌మ్యాన్, డొనాల్డ్‌డక్, బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల గాలిపటాలు కూడా ఉన్నాయి.
విదేశాల నుంచి దిగుమతి
అంతే కాకుండా ప్రజలను ఆకట్టుకోవడానికి వ్యాపారులు కొరియా నుంచి ప్రత్యేకంగా కొన్ని రకాల గాలిపటాలను దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో పారాచూట్, జంతువుల ఆకారంలో ఉన్న గాలిపటాలు ప్రధానమైనవి. ఇవి మూడు నుంచి ఆరు అడుగుల వస్త్రంలో పెద్ద పరిమాణంలో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పారాచూట్, రాకెట్ డిజైన్, డేగ, బొమ్మల డిజైన్‌తో సహా డిజైనర్ గాలిపటాలకు డిమాండ్ పెరుగుతోందని, ఇవి పిల్లలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు.
డిమాండ్‌ను బట్టి తయారీ
కొందరు దుకాణదారులు తమ అనుభవాన్ని చెబుతూ.. ‘మార్కెట్‌లో అనేక రకాల డిజైనర్ గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ శాఖల ఫొటోలు ఉన్న వాటికి యువతలో ప్రాచుర్యం పొందాయి. కార్టూన్ పాత్రలతో కూడిన గాలిపటాలకు పిల్లల్లో చాలా డిమాండ్ ఉంది. పండుగకు వారం రోజుల ముందు నుంచి డిమాండ్ పెరుగుతుంది. తొలినాళ్లతో పోలిస్తే ఈమధ్య గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం పెరుగుతోంది. వినియోగదారుల ఆసక్తిని బట్టి విభిన్న రకాల గాలిపటాలను ప్రత్యేకంగా తెప్పిస్తుంటాం’ అని వివరించారు.
భారీ ఆకారాల్లో గాలిపటాలు
మరో దుకాణదారుడు మాట్లాడుతూ.. కస్టమర్‌లలో అత్యధికంగా కోరుకునే వస్తువు కాటన్ మాంజా అని, జంతువుల ఆకారంలో ఉండే గాలిపటాలు, పేపర్ గాలిపటాలకు కూడా గణనీయమైన డిమాండ్ ఉందన్నారు. ముఖ్యంగా వివిధ సైజుల్లో దొరికే సెలబ్రిటీ గాలిపటాలను ఎక్కుమంది ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మార్కెట్‌లో గాలిపటాలు రూ.15 నుంచి రూ.500 వరకు పలుకుతున్నాయి. వీటిలో స్పూల్ రకం రూ.20 నుంచి రూ.1,000 వరకు, మాంఝా రూ.5 నుంచి రూ.5,000 వరకు ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో కొన్ని గాలి పటాల దర వేలల్లోనూ ఉంటుంది.
Also Read: సికింద్రాబాద్‌లో నేటి నుంచి కైట్ ఫెస్టివల్- ఈ రూట్స్‌లో అసలు వెళ్లొద్దు
Also Read: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో మకర సంక్రాంతి - పండుగ ప్రత్యేకతలు ఇవే
Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!