Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్
Pushpa 2 OTT Records: ఓటీటీలో 'పుష్ప 2' మూవీ ఇంటర్నేషనల్ లెవెల్ లో రఫ్ఫాడిస్తోంది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ కొల్లగొట్టి ఇంటర్నేషనల్ వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతోంది.

రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టిన 'పుష్ప 2' మూవీ వ్యూస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనవరి 30న ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ 4 రోజుల్లోనే సునామీని సృష్టించింది. ఇప్పటిదాకా థియేటర్లలో రికార్డుల మీద రికార్డులు కొట్టిన ఈ మూవీ, ఓటీటీలో కూడా రికార్డుల జాతర మొదలు పెట్టింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తో దూసుకెళ్తోంది.
మిలియన్ల వ్యూస్ తో మరో కొత్త రికార్డు
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2'. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్పగా, రష్మిక మందన్న శ్రీవల్లిగా నటించగా... ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను పోషించారు. అలాగే జగపతిబాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాతో ఊగిపోయారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' దాదాపు 2000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తుండగా, 'పుష్ప 2' ఎట్టకేలకు జనవరి 30 న సైలెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో అన్నీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
అలా ఓటీటీలో అడుగు పెట్టిందో లేదో 'రప్పా రప్పా' అంటూ దూసుకెళ్తోంది ఈ మూవీ. ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియన్స్ ఈ మూవీని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫలితంగా 'పుష్ప 2' మూవీ దాదాపు 7 దేశాలలో ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ది గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల క్యాటగిరిలో 'పుష్ప 2' మూవీ రెండవ స్థానంలో ఉండడం మరో విశేషం. ఇక ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ తో తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్త చరిత్రను సృష్టించింది. త్వరలోనే ఈ వ్యూస్ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
రీ లోడెడ్ వెర్షన్ తో ఎక్స్టా ఫన్
'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ను నాలుగు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా రన్ టైమ్‌కు అదనంగా 22 నిమిషాలు యాడ్ చేయగా, ఓటీటీ వెర్షన్ మొత్తం రన్ టైమ్ 3 గంటల 44 నిమిషాలు ఉంది. ఇప్పటికే థియేటర్లలో ఈ మూవీని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, ఓటీటీలో రిలీజ్ చేసిన రీలోడెడ్ వెర్షన్ లో ఎక్స్టా సీన్స్ తో ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
Rappa rappa international rampage 🔥 https://t.co/HNbArgWjZC
— Netflix India (@NetflixIndia) February 4, 2025
Also Read: Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

