SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
ఎస్ ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సారి ఏకంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను సడెన్ గా ఉలుకూ పలుకు లేకుండా రిలీజ్ చేశారు రాజమౌళి. పసుపు చీరలో కొల్హాపురీ చెప్పులతో దేవతా విగ్రహాల గుహలో రివాల్వర్ రాణిలా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ దేవతా విగ్రహాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారా...నారాయణ జూమ్ వేసుకోండి. కనిపించాయా. ఎస్ ప్రియాంక క్యారెక్టర్ పేరు మందాకిని అని పరిచయం చేశారు రాజమౌళి. పైగా ఆయన ట్వీట్ లో ప్రపంచ స్థాయిలో ప్రూవ్ చేసుకున్న ప్రియాంక చోప్రాను తిరిగి భారత్ కు ఆహ్వానిస్తూ దేశీగర్ల్ అంటూ కోట్ రాజమౌళి మందాకినీ క్యారెక్టర్ కు అనేక షేడ్స్ ఉంటాయంటూ ట్వీట్ చేశారు. మరి ప్రియాంక కేవలం హీరోయినేనా లేదా విలన్ కూడానా ఓ క్లారిటీ రావాలంటే కనీసం నవంబర్ 15 వ తారీఖు గ్లోబ్ ట్రోట్ ఈవెంట్ వరకూ వెయిట్ చేయాల్సింది. మొన్నామధ్య కుంభగా చక్రాల కుర్చీలో పృథ్వీరాజ్ లుక్...ఇప్పుడు మందాకినీ గా ప్రియాంక చోప్రా లుక్...ఆ దేవతా విగ్రహాల గుహ ఏంటో జక్కన్నా వాట్స్ కుకింగ్ అంటున్నారు ఫ్యాన్స్ అయితే.




















