అన్వేషించండి

Vrushakarma Review : వృషకర్మ ఫస్ట్ రివ్యూ - క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్... నాగచైతన్య ఏం చెప్పారంటే?

Vrushakarma First Review : 'వృషకర్మ' తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని చెప్పారు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పారు.

Naga Chaitanya's Vrushakarma Movie First Review : మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'వృషకర్మ' గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉంది. హాలీవుడ్ రేంజ్‌లో అద్భుతమైన విజువల్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... ఈ మూవీ ఇక ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య మూవీ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. అంతే కాకుండా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

అంతకు మించి...

ఆడియన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకు మించిన స్థాయిలో 'వృషకర్మ' ఉండబోతుందని చెప్పారు నాగ చైతన్య. 'మీరు ఏవైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవుతాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్‌కు ఇది ఒక బెంచ్ మార్క్. ఈ స్క్రిప్ట్ విన్నాక నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఇది నెక్స్ట్ లెవల్ అని నాకు అర్థమైంది. ప్రతీ షెడ్యూల్ ముందు నా ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది. టీం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

డైరెక్టర్ కార్తీక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అలా అనిపించింది. ఓ పెద్ద స్కేల్ మైథలాజికల్ సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది.' అని చెప్పారు. దీంతో మూవీపై హైప్ పదింతలు అవుతోంది.

Also Read : ట్రెండింగ్‌లో రయ్ రయ్ రా రా - చెర్రీ ఎనర్జిటికల్ స్టెప్స్ విత్ మాస్ ఫిలాసిఫికల్ లిరిక్స్

నాగ చైతన్యకు బెస్ట్ ఫిల్మ్

హీరో నాగ చైతన్యకు 'వృషకర్మ'తో కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తానే ఇస్తున్నట్లు చెప్పారు డైరెక్టర్ కార్తీక్ దండు. 'నా ఫస్ట్ హీరో నాగార్జున గారే. ఈ సినిమాలో కొత్త నాగ చైతన్యను చూడబోతున్నారు. ఫ్యాన్స్ అందరికీ బెస్ట్ ఫిల్మ్ ఇవ్వబోతున్నా. సుకుమార్ గారికి చాలా థాంక్స్. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టారు. 

గ్లింప్స్‌కు మించి టీజర్, ట్రైలర్ ఉండబోతున్నాయి. ఆ కంటెంట్, ప్రపంచం వేరే లెవల్‌లో ఉండబోతున్నాయి. సృష్టి ధర్మాన్ని నిలబెట్టేందుకు వచ్చిన వాడే వృషకర్మ. విష్ణు సహస్ర నామాల్లో ఒకటి.' అని చెప్పారు.

కింద పడిన చై

ఈ ఈవెంట్‌లో నాగచైతన్య కుర్చీ నుంచి అనుకోకుండా కింద పడిపోయారు. మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌కు అరేంజ్ చేస్తుండగా... కుర్చీలో ఆయన కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోవడంతో వెనక్కి పడ్డారు. దీంతో మూవీ టీం, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయనకు దెబ్బలేమైనా తగిలేయేమో అని కంగారు పడ్డారు. వెంటనే తేరుకున్న చైతన్య పక్కనే ఉన్న డైరెక్టర్ కార్తీక్ దండు సాయంతో పైకి లేచారు. ఈ సందర్భంగా సిబ్బందిపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ మూవీలో ట్రెజర్ హంటర్ అర్జున్‌గా చై కనిపించనుండగా... ఆయన సరసన ఆర్కియాలజిస్ట్ 'దక్ష'గా మీనాక్షి చౌదరి నటించనున్నారు. SVCC బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Leak : రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ మరువక ముందే...
రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ మరువక ముందే...
Prakash Raj : రాముడిది నార్త్... రావణుడిది సౌత్ - రామాయణంపై సెటైర్స్... ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు
రాముడిది నార్త్... రావణుడిది సౌత్ - రామాయణంపై సెటైర్స్... ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు
Papam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: హీరో సమస్య ఏమిటి? తిరువీర్ ఆశించిన విజయం వస్తుందా?
పాపం ప్రతాప్ రివ్యూ: హీరో సమస్య ఏమిటి? తిరువీర్ ఆశించిన విజయం వస్తుందా?
Bad Boy Karthik: పాపం నాగశౌర్య... వెరీ బ్యాడ్ ప్లానింగ్, దారుణమైన రిలీజ్!
పాపం నాగశౌర్య... వెరీ బ్యాడ్ ప్లానింగ్, దారుణమైన రిలీజ్!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
Constitutional Amendment Bills: రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ- బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందా ?
Donald Trump: త్వరలోనే అంతా ముగుస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ - పాకిస్తాన్ వెళ్లానని ప్రకటన
త్వరలోనే అంతా ముగుస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ - పాకిస్తాన్ వెళ్లానని ప్రకటన
Jailer 2 Leak : రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ మరువక ముందే...
రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ మరువక ముందే...
Dindi - Chinchinada Bridge: నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
Prakash Raj : రాముడిది నార్త్... రావణుడిది సౌత్ - రామాయణంపై సెటైర్స్... ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు
రాముడిది నార్త్... రావణుడిది సౌత్ - రామాయణంపై సెటైర్స్... ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
పంజాబ్ జోరు.. నాలుగో విజ‌యంతో టాప్ ప్లేస్ కు కింగ్స్.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్, శ్రేయ‌స్.. ముంబైకీ నిరాశ‌
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు డిజిటల్ బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదిగో శుభసమయం!
అక్షయ తృతీయ రోజు డిజిటల్ బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదిగో శుభసమయం!
Embed widget