అన్వేషించండి

Bihar Election Result  2025: బిహార్ లో నితీష్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా? గ్రహాలు ఏం చెబుతున్నాయ్!

Bihar Prediction 2025: 2025 బిహార్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారుతాయా? నీతీష్ కుమార్ బలం, పూర్తి మెజారిటీ రావడం అనేది సందేహమేనా? బిహార్ లో ఏం జరగబోతోంది?

Bihar Election Result  2025:  బీహార్‌లో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది? దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాచరణ ప్రణాళికలు, వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చాయి. మొదటి, చివరి దశల పోలింగ్ తర్వాత, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించిన గణాంకాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల అంచనా వేసుకుంటున్నారు .. విజయం సాధించే వ్యూహాలపై చర్చిస్తున్నారు.

బీహార్‌ భవిష్యత్తును నిర్ణయించే మూడు ప్రధాన శక్తులు!

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో, ఇందులో బీజేపీ, లోక్‌జనశక్తి పార్టీ, హమ్, ఉపేంద్ర కుష్వాహా పార్టీలు ఉన్నాయి.

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 
తేజస్వి యాదవ్ నేతృత్వంలో ప్రతిపక్షంలో అతిపెద్ద శక్తి.

జన సురాజ్ పార్టీ 
ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ, ఇది యువత, మేధావులలో వేగంగా ప్రజాదరణ పొందుతోంది.

బీహార్ రాజకీయాల్లో 2025-26లో ఎవరు ముందుంటారు? నితీష్ కుమార్ మళ్లీ అధికారంలోకి వస్తారా?

జ్యోతిష్య శాస్త్ర పండితుడు సంజీత్ కుమార్ మిశ్రా జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం.. నితీష్ కుమార్ జాతకం ప్రస్తుతం రాహు-శుక్ర దశతో అనుకూల స్థితిలో ఉంది. రాహువు కుంభ రాశిలో భాగ్య స్థానంలో ఉన్నాడు .. శని కర్మ స్థానానికి బలం చేకూరుస్తున్నాడు. ఇది తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను సూచిస్తుంది. పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు కానీ కూటమి మద్దతుతో అధికారం కొనసాగుతుంది. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపవచ్చు .. ఓటు బ్యాంకు విభజనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నితీష్ కుమార్  జాతకం
 
నితీష్ కుమార్ 1951 మార్చి 1 మధ్యాహ్నం 1:20 గంటలకు  బక్తియార్‌పూర్ (బిహార్)లో జన్మించారు. నితీష్ కుమార్ జాతకం మిథున లగ్నం, అంటే బుధుడి రాశి. ఈ జాతకంలో లగ్నాధిపతి బుధుడు తొమ్మిదవ స్థానంలో సూర్యుడు, గురువు, రాహువుతో కలిసి ఉన్నాడు. కుజుడు-శుక్రుడు పదవ స్థానంలో, శని నాల్గవ స్థానంలో చంద్రుడు ఆరవ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ జాతకంలో రాహు మహాదశ ,  శుక్ర అంతర్దశ నడుస్తున్నాయి. రాహువు కుంభ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు, అయితే కర్మస్థానం పదవ స్థానంలో శని బలంగా ఉన్నాడు. ఈ యోగం కొన్నిసార్లు గందరగోళం .. నిర్ణయం తీసుకోవడంలో సమస్యలు ఉన్నప్పటికీ రాజకీయ స్థిరత్వం మరియు నాయకత్వ సామర్థ్యం కొనసాగుతుందని సూచిస్తుంది. గురువు దృష్టి పదవ స్థానంపై ఉండటం వల్ల ఆయనకు తిరిగి అధికారం పొందే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, నితీష్ కుమార్ అదృష్టం ప్రస్తుతం బలంగా ఉంది. కూటమి మద్దతు లభిస్తుంది   ఆయన మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది.

ప్రశాంత్ కిషోర్ - జన సురాజ్ భవిష్యత్తు

జన సురాజ్ పార్టీని అక్టోబర్ 2, 2024న సాయంత్రం 4:05 గంటలకు పాట్నాలో ప్రారంభించారు. పార్టీ జాతకం కుంభ లగ్నం. దీనికి అధిపతి శని. శని కేంద్రంలో ఉండి మూడవ, ఏడవ మరియు పదవ స్థానాలను చూస్తున్నాడు. ఎనిమిదవ స్థానంలో గ్రహణ యోగం .. రాహు-కేతు అక్షం అధికారం పొందడంలో ఆటంకాలను సూచిస్తాయి. ప్రస్తుతం చంద్ర మహాదశలో రాహు అంతర్దశ నడుస్తోంది, దీనివల్ల పార్టీకి ప్రజల్లో చర్చ జరుగుతుంది, కానీ అధికారంలోకి రావడం కష్టమవుతుంది. అయినప్పటికీ, జన సురాజ్ పార్టీ ఎన్డీఏ , ఆర్జేడీ రెండింటి ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావచ్చు. బిహార్ రాజకీయాల్లో ఇది కింగ్‌మేకర్ పాత్ర పోషించవచ్చు.

నితీష్ కుమార్‌కు పూర్తి మెజారిటీ వస్తుందా?

2026 జూన్ నుంచి రాహు-సూర్యుల అంతర్దశ నితీష్ కుమార్ జాతకంలో ప్రారంభమవుతుంది. ఈ కాలాన్ని రాజయోగంగా చెప్పవచ్చు, ఇది అధికారంలో బలం, పరిపాలనా నియంత్రణను సూచిస్తుంది. అయితే, ఈ కాలంలో ప్రభుత్వ పనుల్లో స్వల్పకాలిక ఆటంకాలు  వ్యతిరేకత కూడా ఉండవచ్చు.

పూర్తి మెజారిటీ పరిస్థితి గురించి మాట్లాడితే.. ప్రస్తుత గ్రహాల స్థితి ప్రకారం గురువు కర్కాటకంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. శని వక్రంగా ఉన్నాడు. సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉన్నాడు ,  శుక్రాదిత్య యోగం ఏర్పరుస్తున్నాడు. కుజుడు  బుధుడు వృశ్చికంలో కలిసి ఉన్నారు. కేతువు సింహంలో ఉన్నాడు, ఇది రాజయోగాన్ని సూచిస్తుంది. ఈ యోగం అధికారం తిరిగి వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది, కానీ పూర్తి మెజారిటీ పరిస్థితి అనిశ్చితంగా ఉంటుంది. కూటమి పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. 

నితీష్ కుమార్ జాతకం బలమైన .. శుభ యోగాలతో నిండి ఉంది కానీ అధికారానికి మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కానీ 2025-27 కాలం ఆయనకు రాజకీయ పునర్జన్మ కాలంగా చెప్పొద్దు. అదే సమయంలో, ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమతుల్యతను తీసుకురావచ్చు   భవిష్యత్తులో పెద్ద పాత్ర పోషించవచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన సూచనల ఆధారంగా అందించాం. ABP దేశం ఏ రకమైన నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget