Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో టాస్ కోసం ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఉపయోగించనున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ నాణేన్ని తయారు చేయించింది.
ఈ గోల్డ్ కాయిన్‌కు ఒకవైపు భారత జాతిపిత మహాత్మ గాంధీ చిత్రం, మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రం ముద్రించారు.
శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో నడిచిన ఈ మహనీయుల గౌరవర్థం ఈ ప్రత్యేక నాణేన్ని రూపొందించారు. ఈ స్పెషల్ కాయిన్‌ను kolkata మ్యాచ్ తో పాటు గువహతి లో జరగబోయే రెండో టెస్ట్ లో కూడా ఈ నాణేన్ని టాస్ సందర్భంగా ఉపయోగించనున్నారు. 2015 నుంచి ఇరు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఫీడ్రమ్ ట్రోఫీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ సరికొత్త toss coin తయారు చేయించింది. అయితే ఈ విషయం బయటకొచ్చినప్పటి నుంచీ కొంతమంది నెటిజన్లు మాత్రం.. ఈ కొత్త కాయిన్ తో అయినా ఇండియా toss ఓటముల పరంపర నుంచీ బయటపడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య team India దాదాపు ప్రతి మ్యాచ్ లో toss ఒడిపోతూ వస్తోంది. ఇప్పటికే 18 మ్యాచ్ లుగా వన్డేల్లో toss ఒడిపోతున్న teaminda.. England తో జరిగిన 5 టెస్టుల్లో toss ఓడిపోయింది. ఇక T20 ల్లోనూ 2 ఏళ్ళలో దాదాపు 20 మ్యాచుల్లో toss ఓడిపోయింది.




















