అన్వేషించండి
Garuda 2.0 OTT Streaming Platform: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ సినిమా... క్రైమ్ థ్రిల్లర్ 'గరుడ 2.0' చూశారా?
Aishwarya Rajesh's Garuda 2.0 on Aha: 'సంక్రాంతికి వస్తున్నాం'తో తెలుగులో ఐశ్వర్యా రాజేష్ భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ కొత్త సినిమా విడుదల తర్వాత మరోసారి ఆవిడ హిట్ కొట్టారు.
ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ సినిమా... క్రైమ్ థ్రిల్లర్ 'గరుడ 2.0' చూశారా?
1/5

ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'గరుడ 2.0'. తమిళంలో సూపర్ హిట్ సాధించిన 'ఆరత్తు సీనం'కు తెలుగు అనువాదం ఇది. హనుమాన్ మీడియా పతాకం మీద 'సూపర్ మచ్చి', 'శాకాహారి', 'కాళరాత్రి', 'నేనే నా', 'కాజల్ కార్తీక', 'టీనెజర్స్', 'కథ కంచికి మనం ఇంటికి' లాంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగులో విడుదల చేసిన విజవంతంగా నిర్మాత బాలు చరణ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఆహా ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది.
2/5

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఐశ్వర్యా రాజేష్ థియేటర్లలో భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆహా ఓటీటీలో 'గరుడ 2.0'తో మరో విజయం అందుకున్నారు.
3/5

అరివాళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గరుడ 2.0'ను ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాలని నిర్మాత బాలు చరణ్ రిక్వెస్ట్ చేశారు. ఈ మూవీ మంచి థ్రిల్ ఇస్తుందని చెప్పారు.
4/5

'గరుడ 2.0' సినిమాలో అరుళ్ నీతి హీరో. ఇటీవల తమిళంలో ఆయన తమిళరాజు సినిమాతో విజయం అందుకున్నారు. 'గరుడ 20' సినిమాలో ఆయన పోలీస్ రోల్ చేశారు.
5/5

'గరుడ 2.0'లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు హీరో గురించి కూడా ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ జాబితాలో ఈ సినిమా చేరిందని చెబుతున్నారు.
Published at : 03 May 2025 02:26 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















