Chinnaswamy Stadium RCB | 2026లో చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆర్సీబీ జట్టు ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే టైటిల్ గెలిచిన ఆనందం రెండు రోజుల్లో మాయమైపోయింది. ఫైనల్ జరిగిన మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విక్టరీ పరేడ్‌లో ఊహించని తొక్కిసలాట జరగడం.. ఆ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. ఇక ఈ తొక్కిసలాట ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగకుండా నిషేధం పడింది. దీంతో 2026 టీ20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా చిన్నస్వామి స్టేడియంని ఇంక్లూడ్ చేయలేదు. ఇక ఇప్పుడు 2026 ఐపీఎల్ ఆడే గ్రౌండ్ల లిస్ట్‌లో నుంచి కూడా ఈ స్టేడియాన్ని తీసేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ సారి ఆర్సీబీ 18 ఏళ్లుగా తమ హోం గ్రౌండ్‌గా ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఈ సారి మ్యాచ్‌లు ఆడలేదన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే హోం గ్రౌండ్ లేకుండానే ఆర్సీబీ ఈ సారి బరిలోకి దిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అయితే 2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లలో హోం గ్రౌండ్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లన్నింటినీ పూణేకు మార్చబోతున్నారట. దీనిపై ఆల్రెడీ చర్చలు జరుగుతున్నట్లు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కమలేష్ పిసాల్ కూడా చెప్పారు. అంటే.. 2026 సీజన్ వరకు ఆర్సీబీ హోం గ్రౌండ్‌గా పూణే స్టేడియం ఉండబోతోందన్నమాట. మరి ఈ నిర్ణయాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారో ఏమో.





















