అన్వేషించండి

Sammathame Review - 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?

Sammathame Telugu Movie Review: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా 'సమ్మతమే'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

సినిమా రివ్యూ: సమ్మతమే
రేటింగ్: 2.5/5
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, 'వైరల్లీ' రవితేజ, 'చమ్మక్' చంద్ర తదితరులు   
సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: కంకణాల ప్రవీణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
విడుదల తేదీ: జూన్ 24, 2022

'రాజావారు రాణిగారు'తో హీరోగా పరిచయమైన యువకుడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన నటించిన తాజా సినిమా 'సమ్మతమే' (Sammathame). ఇందులో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్. ప్రచార చిత్రాలు, శేఖర్ చంద్ర సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? 

కథ (Sammathame Movie Story): పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పేమించాలని అనుకునే యువకుడు కృష్ణ (కిరణ్ అబ్బవరం). పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి గతంలో లవ్ ఎఫైర్స్ వంటివి ఉండకూడదని అనుకుంటాడు. తనకు కాబోయే భార్య తనతో అసలు అబద్ధం చెప్పకూడదని కోరుకుంటాడు. ఆమెను ఇంకో అబ్బాయి తాకినా సహించలేని వ్యక్తి. తండ్రి (గోపరాజు రమణ) సంబంధం చూడటంతో శాన్వి (చాందిని చౌదరి) వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళతాడు. అక్కడ శాన్వికి కాలేజీలో ఎఫైర్ ఉందని తెలియడంతో కోపంగా వచ్చేస్తాడు. ఆ తర్వాత మరో 20 పెళ్లి చూపులకు వెళతాడు. ఏ అమ్మాయిని చూసినా... శాన్విలా అనిపించడంతో మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వెళతాడు. శాన్వి మోడ్రన్ యువతి. దమ్ము కొడుతుంది. మందు తాగుతుంది. కృష్ణ కోరుకున్న లక్షణాలు ఆ అమ్మాయిలో లేవు. దాంతో ఆమెకు ఆంక్షలు విధించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత... నిశ్చితార్థం వరకూ వచ్చాక... శాన్వి వద్దని కృష్ణ ఎందుకు అన్నాడు? కారణం ఏమిటి? చివరకు ఈ ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది సినిమాలో చూడాలి. 

విశ్లేషణ: మన జీవితంలోకి వచ్చే వ్యక్తులను యథావిథిగా స్వీకరించాలని చెప్పే చిత్రమిది. జీవిత భాగస్వామి మనకు నచ్చినట్టు ఉండాలని, మనం చెప్పింది  వినాలని, చెప్పిందే చేయాలని కొందరు కోరుకుంటారు. అయితే... ఆ కోరికతో ఎదుటి వ్యక్తిపై అజమాయిషీ చేయడం కరెక్ట్ కాదని చెబుతుందీ 'సమ్మతమే'. ఈ తరహా కథాంశాలతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. మరి, ఈ సినిమాలో కొత్తదనం ఏముంది?

సినిమా ఎలా ఉంది? (Sammathame Review): శేఖర్ చంద్ర స్వరాలు 'సమ్మతమే'. నేపథ్య సంగీతమూ 'సమ్మతమే'. ఆయన స్వరాలు, సంగీతం లేని సినిమా సమ్మతమేనా? అంటే... సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే... ప్రారంభం నుంచి ముగింపు వరకూ చాలా సన్నివేశాల్లో సంగీతం వీనుల విందుగా ఉంది. తెరపై సన్నివేశాలు నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేశారు శేఖర్ చంద్ర. ఆ కథకు, సన్నివేశాలకు ఆయన సంగీతం బాగా సూట్ అయ్యింది. 

'సమ్మతమే' కథ విషయానికి వస్తే... ఇదేమీ కొత్త కథ కాదు. కానీ, ఈ తరం యువతకు ఎదురైన సందర్భాలు సినిమాలో ఉంటాయి. లేదంటే వారి స్నేహితుల జీవితాల్లో జరిగినట్లు అనిపిస్తుంది. అది మేజిక్కు. సినిమా ప్రారంభం బావుంది. విశ్రాంతి వరకూ సరదాగా సాగింది. అయితే... ఆ తర్వాత పతాక సన్నివేశాల ముందు వరకూ కథ ముందుకు కదలనట్టు, సాగదీసినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు హీరో హీరోయిన్లు గొడవల్లో అర్థం లేదని అనిపిస్తుంది. 

విశ్రాంతి వరకూ హీరో హీరోయిన్ మధ్య కల్చర్ డిఫరెన్స్, ఆ నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు నవ్విస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అటువంటి సన్నివేశాలు రిపీట్ అయినట్టు అనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... అమ్మాయి తన పద్ధతిని ఎందుకు మార్చుకుందనేది అర్థం కాదు. కథలో కాన్‌ఫ్లిక్ట్‌ విషయంలో కొంత గందరగోళం ఉంది. సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ట్రాక్ కథను సాగదీసింది. నవ్వించలేదు కూడా! 

నటీనటులు ఎలా చేశారు?: కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపించారు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు సెటిల్డ్‌గా నటించారు. డైలాగ్ డెలివరీ, టైమింగ్ బావున్నాయి. క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సీన్‌లో పర్వాలేదు. అయితే... ఎమోషనల్ ఎలివేట్ అయ్యేలా చేసి ఉంటే బావుండేది. చాందిని చౌదరి నటించినట్టు లేదు. పాత్రలో జీవించినట్టు చేశారు. ఈతరం అమ్మాయి కావడంతో కథలో సన్నివేశాలు ఎక్స్‌పీరియ‌న్స్‌ చేయడమో... లేదంటే ఆమె స్నేహితులకు ఎదురైన అనుభవాలు వినడమో జరిగి ఉండొచ్చు. అందుకని, చాందిని చౌదరి కనిపించలేదు. క్యారెక్టర్ కనిపించింది. కోపాన్ని చక్కగా ఎక్స్‌ప్రెస్‌ చేశారు. గోపరాజు రమణకు క్లైమాక్స్‌కు ముందు ఒక్క సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. అందులో ఆయన బాగా చేశారు. అన్నపూర్ణమ్మ, శివనారాయణ, 'వైరల్లీ' రవితేజ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. 

Also Read: 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే?: స్వతంత్రంగా ఉండటం వేరు, పద్ధతిగా ఉండటం వేరు. దమ్ము కొట్టి, మందు తాగే అమ్మాయిలు అందరూ పద్ధతిగా ఉండటం లేదని కాదు. ఈ కాలంలో అమ్మాయిల డ్రస్సింగ్, లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళను జడ్జ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. అటువంటి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య ప్రేమ పుడితే... అనేది సినిమా కథాంశం. పాటలు బావున్నాయి. ఫస్టాఫ్ బావుంది. సెకండాఫ్ కొంత సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ ఓకే. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళండి. కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. పాటలు, ప్రచార చిత్రాలు చూసి అంచనాలు పెట్టుకుంటే కష్టం. కథ కంటే కథలో మూమెంట్స్ బావుంటాయి. 

Also Read: చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్ మెప్పించాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
Embed widget