LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP Desam
నిన్న మొన్నటి దాకా తన తోటి టీమ్స్ లా ఉన్న ముంబై, సన్ రైజర్స్ కూడా విజయాల బాట పట్టాయి. ఇక మిగిలింది చెన్నై మాత్రమే అది కూడా ఈ రోజు LSG మీద గ్రాండ్ విక్టరీ కొట్టేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేస్తూ విజయ యాత్ర మొదలుపెడుతుందని ఎక్సెప్ట్ చేశారు సీఎస్కే ఫ్యాన్స్. కానీ చాలా మంది అది అవ్వదమ్మా అన్నారు. కానీ ఫ్యాన్స్ కలలే నిజమయ్యాయి. లక్నోను ఆఖరి ఓవర్లలో డామినేట్ సీఎస్కే 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం
1. పవర్ ప్లేలో చెన్నై జోరు
లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై బౌలర్లు తమ జోరు చూపించారు. ఈ సీజన్ లో తొలిసారిగా లక్నో టాప్ ఆర్డర్ ను కంట్రోల్ లో పెట్టారు. ప్రధానంగా ఖలీల్, అన్షుల్ లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ తో పరుగులు కంట్రోల్ చేయటంతో పాటు ఓపెనర్లు మార్ క్రమ్, పూరన్ లను పవర్ ప్లేలోనే అవుట్ చేశారు. ఖలీల్ మార్ క్రమ్ వికెట్ తీసుకుంటే..ప్రమాదకర పూరన్ ను అన్షుల్ కాంభోజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు.
2. కెప్టెన్ పంత్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్
మిచ్ మార్ష్ మంచి టచ్ లో కనిపించినా జడ్డూ అతన్ని 30పరుగుల మీదున్నప్పుడు క్లీన్ బౌల్డ్ చేయటంతో బడోనీ తో కలిసి బ్యాటింగ్ భారాన్ని మీదేసుకున్నాడు కెప్టెన్ పంత్. ఈ సీజన్ లో 27 కోట్లు పోసి కొనుకున్నా ఆ స్థాయికి తగినట్లు ఒక్క మ్యాచ్ ఆడలేకపోయిన పంత్ ఈరోజు తనలోని అసలు సిసలు ఆటను బయటకు తీశాడు. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో స్లోగా సాగుతున్న LSG స్కోరు బోర్డును చివర్లో పరుగులు తీయించాడు. మొత్తంగా 49 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 63పరుగులు చేసి లక్నోను నిలబెట్టాడు.
3. బడోనీ సమద్ క్యామియోస్
పంత్ అంత ఆడినా కూడా లక్నో స్కోరు అంతంత మాత్రంగానే అనిపించిది. కానీ చివర్లో బడోనీ, సమద్ సిక్సర్లతో మోతెక్కించారు. ఇద్దరూ చెరో రెండు సిక్సర్లు బాదటంతో లక్నో 166 పరుగులు చేయగలిగింది. చివర్లో పతిరానా మంచిగా బౌలింగ్ చేయటంతో పరుగులు కంట్రోల్ అయ్యాయి. ఫలితంగా చెన్నై ముందు 167 పరుగుల టార్గెట్ మాత్రమే ఉండేలా చేశారు చెన్నై బౌలర్లు.
4. తెలుగు, కన్నడ ప్లేయర్ల షో
167 టార్గెట్ తో బరిలోకి చెన్నైకి తొలిసారిగా తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఓపెనింగ్ చేశాడు. ఈ 20 ఏళ్ల కుర్రాడికి తోడు కన్నడ మూలాలన్న న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తోడయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి పవర్ ప్లేలో LSG బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జోరు చూపించారు. రషీద్ 19 బాల్స్ లో 6 సూపర్ ఫోర్లతో 37 పరుగులు చేస్తే...రచిన్ 22 బాల్స్ లోనే 5 ఫోర్లతో 37పరుగులు చేశాడు. చెన్నై ఈ మ్యాచ్ లో గెలిచిందంటే వీళ్లిద్దరూ వేసిన స్ట్రాంగ్ పార్టనర్ షిప్పే రీజన్.
5. దూబే, ధోనీ ధనాధన్
రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, మార్ క్రమ్ ఇలా LSG ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ స్పిన్నర్లు పట్టుబిగించి మిడిల్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేశారు. పైగా వికెట్లు కూడా తీశారు. ఆ దశలో దూబేకి జత కలిసిన ధోని ఫస్ట్ టైమ్ సీజన్ లో మ్యాజిక్ చేశారు. దూబే 37బంతుల్లో 3ఫోర్లు 2సిక్సర్లతో 43పరుగులు చేస్తే...కెప్టెన్ ధోనీ 11బంతుల్లోనే 4ఫోర్లు 1సిక్సర్ తో 26పరుగులు చేసి వింటేజ్ షో చేయటమే కాదు చెన్నైని 5 వికెట్ల తేడాతో గెలిపించి ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేశారు.





















