Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP Desam
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలకు వెండి తెర మీద హీరో విశ్వరూపం చూపిస్తుంటే ఎలా ఉంటుంది హిట్ 3 ట్రైలర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. HIT - హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. 2020లో డైరెక్టర్ శైలేషన్ కొలను క్రియేట్ చేసిన కాప్ యూనివర్స్ ఇది. డార్క్ క్రిమినల్ కేసెస్ ను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ హీరోల కథలతో వచ్చే ఈ సిరీస్ లో పార్ట్ 3 గా హిట్ 3 మే 1 న విడుదల అవుతుంది. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నాని యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. క్రిమినల్స్ గురించి అర్జున్ సర్కార్ గా నాని చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. క్రిమినల్స్ ఉంటే భూమిపైన 10 అడుగుల సెల్ లో ఉండాలి లేదంటే భూమి కింద ఆరడుగుల హోల్ లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ కానీ ఏ క్రిమినల్ కూడా భూమి మీద స్వేచ్ఛగా తిరగటానికి వీలు లేదని..అలా చెప్పటానికి పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదని పోలీసోడు అయితే చాలని... చెప్పే డైలాగ్ తో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్ తో ఉండబోతోంది చెప్పేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. తన తొమ్మిదినెలల పాపను కాపాడాలని విశాఖ పట్నం సెంట్రల్ జైలుకు వచ్చి తన పాపను తీసుకువెళ్లిన వ్యక్తి ఎలా ఉంటాడో చెబుతున్నప్పుడు నాని నే చూపించారు ట్రైలర్ లో. మరి నాని హీరోనా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడా. సరిగ్గా అప్పుడే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వస్తుంది. ఆపదలో ఉన్నవాళ్లని రక్షించటానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి ఎన్నో అహోరాత్రులు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుసు అని చెప్పటానికి నాని చూపించిన విధానం కంప్లీట్ మాస్ హీరోయిక్ స్టఫ్. మరి నాని హీరోనేనా. కన్ఫ్జూజ్ చేయటానికి డైరెక్టర్ శైలేష్ ముందు వేరేలా చూపించారా. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. జనాల మధ్యలో అర్జున్ గా ఉండే వ్యక్తి మృగాల మధ్యలోకి వెళ్లి సర్కార్ గా మారతాడు. మరి ఆ మృగాలను అంతమొందించటానికి ఏం చేశాడు అనేది కట్ షాట్స్ లో చూపించారు. కంప్లీట్ గా బ్లడ్ బాత్ సీన్స్ అన్నీ. రక్తంతో తడిసి ముద్దయ్యాడు నాని అంతే. మనిషి క్రాస్ చేయలేని ఓ లైన్ ని అర్జున్ సర్కార్ క్రాస్ చేసినట్లు చూపించారు. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలగిన శక్తి ఉన్నవాడు శక్తి తప్ప ధర్మ సంస్థాపన వైపుకు ధర్మ రక్షణ వైపు కు అడుగువేయలేడు అని అర్జున్ సర్కార్ కర్తవ్యం ఏంటో చూపించారు. ట్రైలర్ లో ఓ సీన్ ఓ అమ్మాయి యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే ఆ అమ్మాయి కత్తి పెట్టి అమాంతం పొడిచేసి నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట అన్నాడు నాని..పర్సనల్ గా ప్రొఫెషనల్ గా రెండింటికి సూట్ అయ్యేలా పెట్టారు ఈ డైలాగ్. సో అక్కడి నుంచి మళ్లీ రక్తపాతం..ఆ పాపను అర్జున్ సర్కార్ Aka నాని సేఫ్ గా తీసుకువచ్చాడా..లేదా అంత కంటే పెద్ద మిషన్ ఏదన్నా సినిమాలో ఉందా. మే 1 వరకూ వెయిట్ చేయాల్సిందే. కానీ నాని ఫ్యాన్స్ కి...థ్రిల్లర్ క్రైమ్, వయొలెన్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ ఇంటెన్సిఫైడ్ మూవీస్ చూసేవాళ్లకు మాత్రం ఈ బ్లడ్ బాత్ కిక్కిచ్చే ఎక్స్ పీరియన్స్ ఇచ్చే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.





















