అన్వేషించండి

A Thursday Review: ఎ థర్స్‌డే రివ్యూ: థ్రిల్ చేసే హోస్టేజ్ డ్రామా!

A Thursday OTT Review: యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎ థర్స్‌డే’ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ: ఎ థర్స్‌డే
రేటింగ్: 3/5
నటీనటులు: యామి గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధూపియా, డింపుల్ కపాడియా తదితరులు
ఎడిటర్: సుమిత్ కొటియన్
సినిమాటోగ్రఫీ: అనుజ్ రాకేష్ ధావన్
సంగీతం: రూషిన్ దలాల్, కైజాద్ గెర్దా
నిర్మాత: రోనీ స్క్రువాలా, ప్రేమ్‌నాథ్ రాజగోపాలన్
దర్శకత్వం: బెహజాద్ కంబాటా
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2022 (డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల)

A Thursday: ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి యామి గౌతమ్. ఆ తర్వాత బాలీవుడ్‌లో మంచి అవకాశాలు రావడంతో అక్కడే సెటిలైపోయింది. యామి ప్రధాన పాత్రలో నటించిన ‘ఎ థర్స్‌డే’ సినిమా  డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల అయింది. అతుల్ కులకర్ణి, నేహా ధూపియా, డింపుల్ కపాడియా వంటి నటులు ఇందులో ఉండటం, ట్రైలర్ మంచి థ్రిల్లర్ ఫీల్ కలిగించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ: నైనా జైస్వాల్ (యామి గౌతమ్) ఒక ప్లేస్కూల్ నడుపుతూ ఉంటుంది. రోహిత్ (కరణ్‌వీర్ శర్మ) అనే లాయర్‌తో ప్రేమలో ఉంటుంది. ఒకరోజు సడెన్‌గా తన స్కూల్‌లో ఉన్న 16 మంది పిల్లలను బందీలుగా తీసుకుని రూ.ఐదు కోట్లు డిమాండ్ చేస్తుంది. నిరాకరించినందుకు ఒక పిల్లాడిని కెమెరా ముందే చంపేస్తుంది. అసలు తన లక్ష్యం ఏంటి? ప్రధాన మంత్రి మాయ రాజగురును (డింపుల్ కపాడియా) ఎందుకు కలవాలనుకుంటుంది?ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ముందుగా ఈ సినిమా పేరు వినగానే...2007లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎ వెడ్నెస్‌డే’ సినిమా గుర్తుకు వస్తుంది. కేవలం పేరు మాత్రమే కాకుండా సినిమా కూడా అదే టెంపోలో సాగుతుంది. ముందుగా కథని దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ప్రధాన పాత్ర పోషించిన వారిని విలన్‌గా చూపించడం... ఆ తర్వాత కథను ప్రధాన పాత్ర కోణంలోకి మార్చి వారిపై సానుభూతి కలిగేలా చేశారు. తెలుగులో ఈ మధ్య వచ్చిన ‘వి’ సినిమా ట్రీట్‌మెంట్ కూడా ఇలానే ఉంటుంది.

‘ఎ వెడ్నేస్‌డే’ ఉగ్రవాదులపై ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కగా... ‘ఎ థర్స్‌డే’ మరో సమస్య నేపథ్యంలో రూపొందింది. సినిమాలో కీలక ట్విస్ట్‌కు, ఈ సమస్యకు ముడి పడి ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ రివీల్ చేయడం లేదు. సినిమా టెంపో కూడా ఒక పద్ధతిలో సాగుతుంది. కథలోకి వెళ్లడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రారంభం అయిన ఐదు నిమిషాల నుంచే తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నైనాకు ఎదురైన సమస్య ప్రస్తుతం దేశంలో ఒక బర్నింగ్ టాపిక్ కావడంతో ప్రేక్షకులు తన పాత్రకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. దీంతో పాటు చివర్లో రాసుకున్న ట్విస్ట్ కూడా షాకింగ్‌గా మొత్తం సినిమాను జస్టిఫై చేసేలా ఉంటుంది. అయితే సినిమాలో కొన్ని లాజిక్స్ కూడా మిస్సయినట్లు కనిపిస్తుంది. 16 మంది పిల్లలను హోస్టేజ్‌గా తీసుకున్న ఒక వ్యక్తిని ప్రధాని నేరుగా కలవడానికి ఒప్పుకోవడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఇలాంటి చిన్న చిన్న లోపాల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించి ఉంటే సినిమా ఎ వెడ్నెస్‌డే స్థాయిలో ఉండేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే... నైనా పాత్రలో యామి గౌతమ్ జీవించింది. యామి గౌతమ్ ఎంత మంచి నటో ఇంతకు ముందు వచ్చిన ‘కాబిల్’ సినిమా ద్వారానే అందరికీ తెలిసింది. ఈ సినిమా జరుగుతున్నంత సేపు మనకు యామి గౌతమ్ కాకుండా కేవలం నైనా మాత్రమే కనిపిస్తుంది. ఇన్‌స్పెక్టర్ జావెద్ ఖాన్ పాత్రలో అతుల్ కులకర్ణి, ఏసీపీ కేథరిన్ అల్వారెజ్ పాత్రలో నేహా ధూపియా బాగా నటించారు. మనీ హెయిస్ట్‌లో గర్భంతో ఉండే పోలీస్ ఆఫీసర్ అలీసియా సియారా ఇన్‌స్పిరేషన్‌తో నేహా ధూపియా పాత్ర రాసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రధాన మంత్రి మాయా రాజ్‌గురు పాత్రలో డింపుల్ కపాడియా గంభీరంగా కనిపిస్తుంది.

ఓవరాల్‌గా చూసుకుంటే... ఈ సినిమా మంచి థ్రిల్లర్. ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే సస్పెన్స్‌తో పాటు ఆలోచింపచేసే పాయింట్ కూడా ఇందులో ఉంటుంది. ఈ వీకెండ్‌లో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్.

Also Read: 'మళ్ళీ మొదలైంది' రివ్యూ: సుమంత్ విడాకుల సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Three Gorges Dam in space: అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
Embed widget