News
News
X

Talking in Sleep: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?

(Talking in Sleep) నిద్రలో ఎవరైనా మాట్లాడితే విని నవ్వుకుంటాం, కానీ అది అనారోగ్యానికి సూచిక అని మాత్రం అర్థం చేసుకోం.

FOLLOW US: 

(Talking in Sleep) కొంతమంది పిల్లలు, పెద్దవాళ్లు నిద్రలోనే మాట్లాడేస్తుంటారు. ఏవేవో కథలు చెబుతారు లేదా ఎవరినో తిడతారు. అవన్నీ విని పక్కన ఉన్న కుటుంబసభ్యులు నవ్వుకుంటారు. కారణం అది ఆ మనిషి మనసులో దాగి ఉన్న బాధకు, రుగ్మతకు సంకేతం అని తెలియకపోవడమే. అయితే ఇది ప్రమాదకరమైన సమస్య అని మేము చెప్పడం లేదు కానీ అది మానసిక ఆరోగ్యంతో  ముడిపడి ఉందని మాత్రమే చెప్పగలరం. ఎంతో మంది మానసిక వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాబోయే మానసిక సమస్యలకు ఇవి సంకేతాలుగా కూడా భావించవచ్చు. 

వారికి గుర్తుంటుందా?
నిద్రలో మాట్లాడేవారికి వారు ఏం మాట్లాడారో, ఎలా అరిచారో లేచాక గుర్తుండదు. పక్కవాళ్లు అడిగినా ‘అవునా’ అని ఆశ్చర్యపోతారు కానీ నమ్మలేరు. ఎప్పుడో ఓసారి మాట్లాడి వదిలేస్తే ఫర్వలేదు కానీ, కొంతమంది తరచూ నిద్రపోయాక ‘స్లీప్ టాక్’ చేస్తుంటారు. అలా చేస్తే దాన్ని సమస్యగానే గుర్తించాలి. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. 

దీన్ని ఏమంటారు?
వైద్య పరిభాషలో ఇలా నిద్రలో మాట్లాడే విధానాన్ని ‘సోమ్నిలోకీ’ అంటారు. ఇదొక రకమైన పారాసోమ్నియా. అంటే నిద్రలో జరిగే అసాధారణ ప్రవర్తన. ఇది వైద్యపరమైన సమస్య కాకపోవచ్చ కానీ కచ్చితంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించినదే. వైద్యులు చెప్పిన దాని ప్రకారం స్లీప్ టాక్ అనేది 30 సెకన్ల పాటూ ఉంటుంది.కొన్ని సార్లు వారు ఏమంటున్నారో అర్థం చేసుకోవడం కడూా కష్టమే. అమెరికాలో దాదాపు 70 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఏమిటీ కారణాలు?
REM స్లీప్ బిహేవియర్ డిజార్డర్, స్లీప్ టెర్రర్స్ నిద్రలో మాట్లాడటానికి ముఖ్య కారణాలు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి తీవ్రంగా మారితే నిద్రలో నడిచే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమంది ప్రజలు నిద్రలో అరుస్తూ, గుసగుసలాడుతూ, హింసాత్మకంగా కూడా ప్రవర్తిస్తారు.  గాయాలు తగలడం, భావోద్వేగపరంగా ఒత్తిడికి గురవ్వడం, వివిద మానసిక రుగ్మతలతో బాధపడడం, డ్రగ్స్ వాడే అలవాటు ఉండడం ఇవన్నీ నిద్రలో మాట్లాడేందుకు దోహదం చేస్తాయి. ఇక పిల్లల విషయానికి వస్తే వారు భయపడినప్పుడు ఇలా జరుగుతుంది.

స్లీప్ టాకింగ్ అనేది పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో ముడిపడి ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. కొంతమంది స్లీప్ టాకింగ్ లోనే పళ్లు కొరుకుతారు. స్లీప్ వాకింగ్ చేయడం వంటివి చేస్తారు. ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. స్లీప్ అప్నియా వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చు. ఇలాంటి వారికి మాత్రం వెంటనే చికిత్స అందించడం అవసరం. 

ఇలాంటి వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. 

Also read: సెల్‌ఫోన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయా? ఈ రెండింటికీ మధ్య లింకేంటి?

Also read: దీవిలో ఒంటరిగా 29 ఏళ్లు బతికిన వ్యక్తి, ఆ దీవికి గుడ్ బై చెప్పాల్సి వస్తే, వీడియో చూడండి

Published at : 03 Jul 2022 08:39 AM (IST) Tags: Mental illness Talking in Sleep Sleep talk Why people talk in sleep

సంబంధిత కథనాలు

Banana Flower: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే

Banana Flower: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే

కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు

ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్

టాప్ స్టోరీస్

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!