అన్వేషించండి

Inverter vs Non-Inverter AC: ఈ వేసవిలో మీ ఇంటికి ఇన్వర్టర్ ఏసీ కావాలా, నాన్-ఇన్వర్టర్ ఏసీ సరిపోతుందా?

Air Conditioner Purchase Tips: వేసవి రోజుల్లో ఎయిర్ కండిషనర్ తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది, సమ్మర్‌ ప్రారంభంలోనే తమ ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు.

Which Type Of AC Is Better For Your Home: సమ్మర్‌లో ఇంటి, ఒంటిని చల్లబరుచుకోవడానికి ఎయిర్‌ కూలర్‌ (Air Cooler) లేదా ఎయిర్ కండిషనర్ (Air Conditioner) అవసరం. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ ఆధారంగా ఎయిర్ కండిషనర్‌ (AC)లలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. ఏటా కొత్త ఫీచర్లు యాడ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా, వీటిని రెండు రకాలుగా చూడవచ్చు - ఇన్వర్టర్ AC & నాన్-ఇన్వర్టర్ AC. ఈ రెండింటిలో ఏది కొనాలో అర్ధం కాక ప్రజలు గందరగోళానికి గురవుతుంటారు. 

ఇన్వర్టర్ AC - నాన్-ఇన్వర్టర్ AC మధ్య తేడాలు

కంప్రెసర్‌లో తేడా
ఇన్వర్టర్ ACలోని కంప్రెసర్ తన వేగాన్ని గది ఉష్ణోగ్రత ప్రకారం పెంచుకుంటుంది లేదా తగ్గించుకుంటుంది. నాన్-ఇన్వర్టర్ ACలో, కంప్రెసర్ పూర్తిగా ఆన్ లేదా ఆఫ్‌లో ఒకే వేగంతో నడుస్తుంది. గది ఉష్ణ్గోగ్రతను బట్టి సర్దుబాటు చేసుకుని ఆన్‌-ఆఫ్‌ కావడం వల్ల ఇన్వర్టర్ AC తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. నాన్-ఇన్వర్టర్ AC ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది & ఎక్కువ శబ్దం కూడా చేస్తుంది.

తక్కువ విద్యుత్ వినియోగం
ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన ఏసీలు తక్కువ విద్యుత్తును వినియోగించుకోవడమే కాదు, గది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతాయి. వెలుపలి ఉష్ణోగ్రత లేదా ఆ గదిలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఈ సాంకేతికత ఆధారపడి ఉంటుంది. మొత్తం AC వ్యవస్థ దీని ప్రకారమే పని చేస్తుంది. ఈ అంశమే.. సాధారణ AC కంటే ఇన్వర్టర్‌ ACని మెరుగ్గా నిలబెడుతుంది.

PWM సాంకేతికత
ఇన్వర్టర్ ACలో, 'పల్స్ విడ్త్‌ మాడ్యులేషన్' ‍‍(PWM) అనే ప్రత్యేక సాంకేతికత ఉంటుంది, ఈ కారణంగా కంప్రెసర్ స్థిరమైన వేగంతో నడుస్తూనే ఉంటుంది. ఇది గదిని వేగంగా చల్లబరచడంతో పాటు యంత్రంపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ టెక్నాలజీ ఉండడం వల్ల AC జీవితకాలం కూడా పెరుగుతుంది. అంతేకాదు, ఇన్వర్టర్ AC నిర్వహణ కూడా నాన్-ఇన్వర్టర్ AC కంటే తక్కువగా ఉంటుంది.

రిఫ్రిజెరాంట్ వినియోగం
నాన్-ఇన్వర్టర్ ACలు పాత రకం రిఫ్రిజెరెంట్‌లను ఉపయోగిస్తుండగా.. ఇన్వర్టర్ ACలు R32 వంటి పర్యావరణ అనుకూల రిఫ్రిజెరెంట్‌లను ఉపయోగిస్తాయి. ఇవి మెరుగైన శీతలీకరణను అందిస్తాయి & పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

గాలిలోని తేమ
ఇన్వర్టర్ ACకి ఉన్న మరో కీలక లక్షణం.. గాలిలోని తేమను మెరుగైన రీతిలో తొలగించడం. ముఖ్యంగా, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇప్పటికే నిరూపితమైంది. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులకు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని కూడా అది నియంత్రిస్తుంది, తద్వారా మీ గది రోజంతా ఒకే విధంగా చల్లగా ఉంటుంది.

ధరలో తేడా
ధర విషయానికి వస్తే.. ఇన్వర్టర్ AC ప్రారంభ ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది కాబట్టి ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా ఉపయోగకరమైన ACగా నిలవగలదు. ఇన్వర్టర్‌ ACతో పోలిస్తే నాన్-ఇన్వర్టర్ AC ఖచ్చితంగా చవకగా ఉంటాయి. కానీ వాటి నిర్వహణ ఖర్చు & విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉంటాయి. ఇన్వర్టర్ ACలు ఎక్కువ మన్నికైనవి & తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకున్నవి. నాన్‌-ఇన్వర్టర్ ACలు తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి.

మరమ్మతులు
ఈ విషయంలో ఇన్వర్టర్‌ ACలు ప్రయోజనకరం కాదు. ఇన్వర్టర్‌ ACలు మైక్రోచిప్‌ల ఆధారంగా నడుస్తాయి, మదర్‌బోర్డ్‌లో రిపేర్‌ వస్తే జేబుకు అతి పెద్ద చిల్లు పడుతుంది. నాన్‌-ఇన్వర్టర్‌ ఏసీల్లో చిప్‌ సెట్‌ ఉండదు కాబట్టి మరమ్మతుల ఖర్చు తక్కువగా ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Winter Skin Care Tips : చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Embed widget