OnePlus 13T: వన్‌ప్లస్ 13T ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఏ కంపెనీ ఫోన్లకు ఇది పోటీ ఇస్తుంది?
OnePlus 13T Features: ఫోన్ కుడి వైపున వాల్యూమ్ బటన్, పవర్ బటన్ కనిపిస్తాయి. వెనుక వైపున డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

OnePlus 13T Launching Date In India: వన్‌ప్లస్ ఫోన్‌లను ఇష్టపడే వారికి శుభవార్త. ఈ కంపెనీ, తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 13T ను త్వరలో విడుదల చేయబోతోంది & లాంచింగ్ డేట్ ప్రకటించింది. OnePlus 13T ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఇది మూడో ఫోన్. గతంలో OnePlus 13 & OnePlus 13R ఫోన్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
వన్‌ప్లస్ 13టీ ఫీచర్లు (OnePlus 13T Features)
OnePlus 13T లాంచ్ డేట్ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, దానిలో ఏ ప్రత్యేక ఫీచర్లు ఉంటాయో తెలుసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ సైజ్‌లో ఉంటుంది.
వన్‌ప్లస్ 13టీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ కంపెనీ చైనా వెలుపల ఏప్రిల్ 24న OnePlus 13Tని లాంచ్ చేయనుంది. కంపెనీ తన టీజర్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఆ టీజర్ ప్రకారం కాంపాక్ట్ సైజును అంచనా వేయవచ్చు. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో వస్తుంది. వాల్యూమ్ బటన్, పవర్ బటన్ స్మూత్‌గా కనిపిస్తున్నాయి & ఇవి ఫోన్ కుడి వైపున ఏర్పాటయ్యాయి. దిగువ భాగాన స్పీకర్ గ్రిల్, USB-C పోర్ట్, SIM కార్డ్ ట్రే కోసం స్పేస్ ఉంది. ఫోన్ వెనుక వైపున డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపించింది.
వన్‌ప్లస్ 13టీ బ్యాటరీ & కెమెరా (OnePlus 13T Battery and Camera)
OnePlus 13T లోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సల్ (MP) కావచ్చు, ద్వితీయ కెమెరా కూడా 50MP ఉండవచ్చు. ఫోన్ స్క్రీన్ 6.32 అంగుళాలు ఉంటుంది. ఫోన్‌లోకి పవర్ కోసం 6000mAh బిగ్ బ్యాటరీని అనుసంధానించవచ్చు. దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 55,000 వరకు ఉంటుందని అంచనా.
OnePlus 13T ఏ ఫోన్‌తో పోటీ పడుతుంది?
OnePlus 13T అంచనా ధర వద్ద ఐకూ 13 (iQOO 13) కూడా కనిపిస్తోంది. OnePlus 13T నేరుగా iQOO 13 పోటీ పడుతుంది. iQOO 13 లో 6.82 అంగుళాల AMOLED స్క్రీన్‌తో సెట్ చేశారు, ఇది 3168 * 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ అందిస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 5G, 4G VoLTE, GPS, Wi-Fi, బ్లూటూత్ 5.4, USB & NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ప్రైస్ రేంజ్‌లో ప్రజలకు ఉన్న రెండో ఆప్షన్ రియల్‌మీ జీటీ 7 ప్రో (Realme GT 7 Pro). ఇది 6.78 అంగుళాల 1.5K 8T LTPO Eco² OLED ప్లస్ మైక్రో-కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Realme GT 7 Proలో 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999 & 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 65,999.





















