AP DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ 2025లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
AP DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధంచిన నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులో ఉన్నాయో చూడండి

AP DSC Vacancies 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఏ క్షణమైన అధికారిక ప్రకటన రానుంది. గత ఏడాది నుంచి జరుగుతున్న సస్పెన్స్‌కు తెరపడబోతోంది. 16వేలకుపైగా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ భర్తీ చేయనుంది. మరోవైపు ప్రత్యేక ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా మరో నోటిఫికేషన్‌తో భర్తీ చేయనుంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 2024లోనే ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారో కూడా చెప్పేశారు. ఆ వివారాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలో ఉన్న ఖాాళీల వివరాలు ఇవే
| క్రమ సంఖ్య | జిల్లా పేరు (ఉమ్మడి జిల్లాలు) | స్కూల్ అసిస్టెంట్(ఫస్ట్ లాంగ్వేజ్) | స్కూల్ అసిస్టెంట్(సెకండ్ లాంగ్వేజ్) | స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ | స్కూల్ అసిస్టెంట్ గణితం | స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ | స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ | స్కూల్ అసిస్టెంట్ సోషల్ | స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ | ఎస్జీటీ | మొత్తం పోస్టులు |
| 1 | శ్రీకాకుళం | 34 | 11 | 64 | 33 | 14 | 32 | 66 | 81 | 72 | 407 |
| 2 | విజయనగరం | 12 | 14 | 19 | 8 | 32 | 19 | 58 | 62 | 146 | 370 |
| 3 | విశాఖపట్నం | 24 | 28 | 52 | 57 | 36 | 52 | 88 | 139 | 149 | 625 |
| 4 | తూర్పుగోదావరి | 53 | 75 | 88 | 61 | 68 | 95 | 118 | 210 | 258 | 1026 |
| 5 | పశ్చిమగోదావరి | 35 | 45 | 77 | 37 | 38 | 58 | 97 | 178 | 160 | 725 |
| 6 | కృష్ణ | 35 | 23 | 88 | 48 | 53 | 140 | 130 | 122 | 456 | 1095 |
| 7 | గుంటూరు | 35 | 54 | 61 | 32 | 57 | 82 | 102 | 166 | 306 | 895 |
| 8 | ప్రకాశం | 30 | 23 | 94 | 92 | 24 | 70 | 106 | 72 | 80 | 591 |
| 9 | నెల్లూరు | 37 | 17 | 83 | 62 | 75 | 62 | 102 | 105 | 72 | 615 |
| 10 | చిత్తూరు | 37 | 12 | 100 | 29 | 28 | 60 | 125 | 86 | 828 | 1305 |
| 11 | కడప | 19 | 16 | 78 | 41 | 34 | 48 | 60 | 77 | 240 | 613 |
| 12 | అనంతపురం | 35 | 26 | 99 | 40 | 62 | 70 | 106 | 143 | 80 | 661 |
| 13 | కర్నూలు | 79 | 113 | 78 | 90 | 66 | 72 | 112 | 206 | 1731 | 2547 |
| మొత్తం పోస్టులు | 465 | 457 | 981 | 630 | 587 | 860 | 1270 | 1647 | 4578 | 11475 |
మున్సిల్ పాఠశాలలో ఉన్న ఖాళీల వివరాలు ఇవే
| క్రమ సంఖ్య | జిల్లా పేరు (ఉమ్మడి జిల్లాలు) | స్కూల్ అసిస్టెంట్(ఫస్ట్ లాంగ్వేజ్) | స్కూల్ అసిస్టెంట్(సెకండ్ లాంగ్వేజ్) | స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ | స్కూల్ అసిస్టెంట్ గణితం | స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ | స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ | స్కూల్ అసిస్టెంట్ సోషల్ | స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ | ఎస్జీటీ | మొత్తం పోస్టులు |
| 1 | శ్రీకాకుళం | 3 | 1 | 1 | 0 | 0 | 1 | 5 | 1 | 39 | 51 |
| 2 | విజయనగరం | 4 | 1 | 5 | 0 | 0 | 1 | 2 | 2 | 61 | 76 |
| 3 | విశాఖపట్నం | 10 | 4 | 7 | 2 | 3 | 10 | 6 | 0 | 67 | 109 |
| 4 | తూర్పుగోదావరి | 29 | 7 | 11 | 3 | 6 | 11 | 20 | 3 | 118 | 208 |
| 5 | పశ్చిమగోదావరి | 14 | 3 | 8 | 8 | 4 | 1 | 5 | 7 | 260 | 310 |
| 6 | కృష్ణ | 20 | 9 | 9 | 7 | 6 | 3 | 5 | 4 | 50 | 113 |
| 7 | గుంటూరు | 26 | 6 | 9 | 4 | 1 | 5 | 9 | 3 | 185 | 248 |
| 8 | ప్రకాశం | 12 | 2 | 1 | 2 | 0 | 1 | 0 | 2 | 18 | 38 |
| 9 | నెల్లూరు | 12 | 3 | 1 | 1 | 5 | 0 | 0 | 1 | 30 | 53 |
| 10 | చిత్తూరు | 12 | 9 | 8 | 4 | 1 | 9 | 8 | 1 | 116 | 168 |
| 11 | కడప | 14 | 2 | 3 | 3 | 1 | 3 | 6 | 3 | 57 | 92 |
| 12 | అనంతపురం | 10 | 9 | 4 | 4 | 5 | 2 | 6 | 5 | 101 | 146 |
| 13 | కర్నూలు | 11 | 2 | 4 | 3 | 4 | 4 | 4 | 6 | 60 | 98 |
| మొత్తం పోస్టులు | 177 | 58 | 71 | 41 | 36 | 51 | 76 | 38 | 1162 | 110 |
చాలా కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు చాలా ఆశగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఉద్యోగ అర్హత ఏజ్ లిమిట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. రెండు రోజుల క్రితం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి 42 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచారు.
నోటిఫికేషన్‌లో కూడా చాలా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి వివిధ స్కూళ్ల ఆప్షన్స్‌ను నోటిఫికేషన్‌లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా సర్టిఫికెట్లు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంది.





















