Weekly Horoscope: ఈ రాశుల ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఈ వారం శుభవార్త వింటారు - వారఫలాలు ఏప్రిల్ 21 to 27
Weekly Horoscope April 21 to April 27, 2025: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉంది .. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Your Weekly Horoscope: ఏప్రిల్ 21 నుంచి 27 వరకూ ఈ వారం మీ రాశిఫలాలు....
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం మేషరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. నిలిచిపోయిన పనులు ఈ వారం ప్రారంభమవుతాయి...కొత్త ప్రాజక్టులు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి ఉంటుంది. కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు పొందుతారు.
వృషభ రాశి (Taurus Weekly Horoscope)
ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలున్నాయి. మీ జీవితంలో, ఉద్యోగంలో సానుకూల మార్పులు వస్తాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి నిరాశ పొందుతారు. వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలుంటాయి.
మిథున రాశి (Gemini Weekly Horoscope)
ఈ వారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఇంటా బయటా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో ఉద్రిక్తత ఉండొచ్చు. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది..ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటంది. ఈ వారం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ప్రేమసంబంధాల్లో మంచి ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది...అదృష్టంతో పాటూ సవాళ్లు కూడా ఉంటాయి. ఆందోళన తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది. వాహనాన్ని నడుపుతున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు.
సింహ రాశి (Leo Weekly Horoscope)
ఈ వారం సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. మీద్వారా ప్రయోజనం పొంది మీకు ముఖం చాటేసేవారికి పాఠం నేర్పిస్తారు. ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తారు. మీరు చేసే పని విషయంలో స్పష్టంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. అనవసర కోపాన్ని నివారించండి
కన్యా రాశి (Virgo Weekly Horoscope)
కన్యా రాశివారికి ఈ వారం ప్రారంభంలో అదృష్టం కలిసొస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు ఉంటాయి కానీ వాటినుంచి బయటపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. చర్మసంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. మానసికంగా బాధపడతారు.
తులా రాశి (Libra Weekly Horoscope)
ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనసు పరధ్యానంలో ఉంటుంది. పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)
ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. చాలా చురుకుగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఒత్తిడికి దూరంగా ఉంటారు. వ్యాపారంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు కొన్నిసమస్యలుంటాయి. ప్రేమ వ్యవహారాలలో మీ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ఈవారం ధనస్సు రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. ఒంటరి వ్యక్తుల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితం ఆహ్వాదకరంగా ఉంటుంది.
మకర రాశి (Capricorn Weekly Horoscope)
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది కానీ అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని అనవసర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా వ్యవహరించండి.
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారంలో అనుకోని సమస్యలుంటాయి. అయితే వారం ప్రారంభంలో కన్నా వారాంతానికి సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమికులు వారిభాగస్వామి కారణంగా సంతోషం పొందుతారు. వారాంతంలో ఓ శుభవార్త వింటారు
మీన రాశి (Pisces Weekly Horoscope)
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మరింత కష్టపడాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని చికాకులుంటాయి.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















