Diabetes Diet: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఆహారం ద్వారానే దాన్ని కంట్రోల్ చేయాలి.
ఒక్కసారి మధుమేహం వచ్చిందా ఇక శరీరంలోంచి దాన్ని బయటికి పంపడం ఎవరితరం కాదు, కానీ దాన్ని అదుపులో పెట్టడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకోవాలి. అందుకు ఆహారపరిమితులను తమకు తామే విధించుకోవాలి. మధుమేహం అదుపులో లేకపోతే దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతుంది. మూత్రపిండాలు, కళ్లు, గుండె సమస్యలు అధికంగా వస్తాయి. ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు నిక్కీ సాగర్ మధుమేహ రోగుల కోసం ఓ డైట్ ప్లాన్ సిద్ధం చేశారు. దీన్ని పాటిస్తే వారంలోనే షుగర్ అదుపులోకి వచ్చేస్తుందని చెబుతున్నారు.
ఏం చేయాలంటే...
మధుమేహులు రోజూ 3 నుంచి 4 గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి. అలాగే నీళ్లలో మెంతులు నానబెట్టి ఆ నీటిని తాగాలి. రోజూ గుప్పెడు బాదం లేదా వాల్ నట్లు తినాలి. అలాగే కిందచెప్పిన విధంగా రోజూ వారీ డైట్ ప్లాన్‌ను పాటించాలి.
సోమవారం
అల్పాహారం: బాదం లేదా వాల్‌నట్ వంటి నట్స్ కలిపిన ఒక కప్పు ఓట్స్. దీని తయారీకి తక్కువ కొవ్వున్న పాలను ఉపయోగించాలి. దీనిలో మధుమేహాన్ని అరికట్టే ఫైబర్ అధికంగా ఉంటుంది.
లంచ్: 1 రోటీ లేదా ఒక కప్పు బ్రౌన్ రైస్. ఒక గిన్నె చికెన్ లేదా పనీర్, ఒక గిన్నె పెరుగు.
స్నాక్స్: ఒక యాపిల్ లేదా బెర్రీ పండ్లు.
రాత్రి భోజనం: ఒకటి లేదా రెండు రోటీలు,ఒక కప్పు పప్పు, కాలీఫ్లవర్లు, పుట్టగొడుగులు, బ్రోకలీ మొదలైన వాటితో వండిన ఒక కప్పు కూర.
మంగళవారం
అల్పాహారం: గుడ్లలోని తెల్లసొనతో వేసి ఆమ్లెట్. ఒక జామ పండు లేదా ఆరెంజ్.
మధ్యాహ్న భోజనం: ఒక కప్పు బ్రౌన్ రైస్ లేదా ఒకచపాతీ. వేయించిన చేపలు లేదా వేయించిన కూరగాయలు, ఒక కప్పు పెరుగు.
స్నాక్స్: ఒక కప్పు మొలకలు లేదా ఉడికించిన మొక్కజొన్న.
రాత్రి భోజనం: ఒకట్రెండు చపాతీలు, ఒక కప్పు పప్పు లేదా ఒక కప్పు కూర.
బుధవారం
అల్పాహారం: పోహా లేదా శెనగపిండితో వేసి అట్లు. ఒక ఆమ్లెట్ లేదా బ్రెడ్ టోస్ట్‌లు కూడా మంచి ఎంపిక. బ్రెడ్ మైదాతో తయారైనది తినకండి. గోధుమ, ధాన్యాలతో తయారైంది ఎంచుకోండి.
లంచ్: చికెన్ లేదా పనీర్ తో వండిన ఒక కప్పు కూర. ఒక కప్పు బ్రౌన్ రైస్, ఒక కప్పు పెరుగు.
స్నాక్స్: కొన్ని ఖర్జూరాలు, నట్స్, పాప్ కార్న్
డిన్నర్: హోల్ గ్రెయిన్ పాస్తా, ఆకుపచ్చ కూరగాయలతో వండిన ఒక కప్పు కూర
గురువారం
అల్పాహారం: ఒక నారింజ పండు లేదా జామ పండు. వెజిటబుల్ స్టఫ్డ్ పరాటా.
మధ్యాహ్న భోజనం: పాలకూర లేదా కోడి గుడ్డు కూరతో అన్నం
స్నాక్స్: వెజిటబుల్ సూప్ లేదా చికెన్-కొత్తిమీర సూప్
రాత్రి భోజనం: ఒక కప్పు క్వినోవా రైస్, ఒక కప్పు పప్పు
శుక్రవారం
అల్పాహారం: బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్, ఒక యాపిల్ లేదా గుడ్డు
మధ్యాహ్న భోజనం: అన్నం లేదా ఒక చపాతీ. చికెన్ కర్రీ, ఒక కప్పు పెరుగు
స్నాక్స్: వేయించిన మఖానాలు
రాత్రి భోజనం: రెండు చపాతీలు, పుట్టగొడుగుల కూర
శనివారం
అల్పాహారం: తాజా పండ్ల రసంతో ఉప్మా, పోహా లేదా ఇడ్లీ
మధ్యాహ్న భోజనం: వేయించిన చేపలు లేదా గుడ్డు కూరతో అన్నం, అన్నానికి బదులు చపాతీ తినవచ్చు.
స్నాక్స్: పనీర్ స్నాక్స్ లేదా ఉడకించిన మొక్కజొన్న.
విందు: చపాతీ, చనా మసాలా కూర.
ఆదివారం
అల్పాహారం: సాదా దోశె, పండ్ల రసం
మధ్యాహ్న భోజనం: దాల్ మఖానీతో అన్నం లేదా చపాతీ, ఒక గిన్నె కూరగాయల సలాడ్
స్నాక్స్: అరటికాయ చిప్స్ లేదా కాకరకాయ చిప్స్
రాత్రి భోజనం: వెజిటబుల్ పులావ్ లేదా కోడి గుడ్డు పులావ్
Also read: మనం రోజూ తినే ఆహారాలలో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే
Also read: గర్భిణిలు కాకరకాయ తింటే చాలా సమస్యలు దరిచేరవు, మీ బిడ్డకోసమైనా తినండి