Highest Paid Directors: భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్... టాప్ 5లో నలుగురు మనోళ్ళే
Highest Paid Directors : అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న పాన్ ఇండియా డైరెక్టర్స్ టాప్ 5లో మనోళ్ళే నలుగురు ఉండడం విశేషం. ఆ లిస్ట్ లో జక్కన్న, సందీప్ రెడ్డి వంగా, అట్లీ, సుకుమార్ ఉన్నారు.

ఇండియన్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక టెక్నాలజీ, భారీ బడ్జెట్ ని ఉపయోగించి ప్రపంచ స్థాయి సినిమాలు తెరకెక్కించడానికి ముందడుగు వేస్తోంది. ఓవైపు జక్కన్న మహేష్ బాబుతో కలిసి ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు పాన్ ఇండియా స్టార్ యష్ ఇండియన్ రామాయణాన్ని ప్రపంచ తెరపై చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు అట్లీ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాతో సౌత్ సినిమాను చూసి ప్రపంచమే గర్వపడే స్థాయికి తీసుకెళ్తాను అంటూ అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ మూవీకి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సినిమాల కోసం హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనేది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్కే. కానీ అవే సినిమాలకు దర్శకులు తీసుకుంటున్న పారితోషకం ఎంత ? ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ డైరెక్టర్స్ ఎవరు? అనే విషయాలను ఆరా తీస్తే... అందులో టాప్ 5 హయ్యెస్ట్ పెయిడ్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో మనోళ్లే నలుగురు ఉండడం విశేషం. అందులోనూ టాలీవుడ్ దర్శకులే ముగ్గురు.
మహేష్ సినిమాకు రాజమౌళి తీసుకునేది టాప్...
Rajamouli Remuneration: జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. ఇక ఓటమన్నదే ఎరగని జక్కన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకు 200 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నట్టు సమాచారం. తెలుగు సినిమా కీర్తి కిరీటంలో ఆస్కార్ ను సైతం తెచ్చి పెట్టిన ఘనత డైరెక్టర్ రాజమౌళిది. అందుకే ఆయన సినిమాల విషయంలోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలోనూ నెంబర్ వన్ గా ఉన్నారు.
యానిమల్ హిట్‌తో పెరిగిన సందీప్ రెడ్డి వంగా...
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంలో మాత్రం దిట్ట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్ గా 'యానిమల్' సినిమాతో ఏకంగా 900 కోట్లను కొల్లగొట్టిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమాకు సిద్ధమవుతున్నారు.
తమిళ్ సినిమాల నుంచి 'జవాన్' వరకూ వెళ్లిన...
తమిళ డైరెక్టర్ అట్లీ ఈ హయ్యెస్ట్ పెయిడ్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్టులో టాప్ 3లో ఉన్నారు. 100% సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న ఈ డైరెక్టర్ ఇప్పటిదాకా తెరకెక్కించింది కేవలం 6 సినిమాలు మాత్రమే. మెర్సల్, బిగిల్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అట్లీ రేంజ్ మరింతగా పెరిగింది. 2023లో రిలీజ్ అయిన 'జవాన్' మూవీ ఈ డైరెక్టర్ కెరీర్ కి కు కీలక మలుపుగా మారింది. ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక జవాన్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఆ తర్వాత స్థానంలో హిందీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఉన్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు 80 కోట్లు.
పుష్ప 2 విజయంతో పెరిగిన సుకుమార్ క్రేజ్...
ఈ లిస్టులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐదవ స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన 'పుష్ప 2' అయితే ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టి, పాన్ ఇండియా హీరోలకి కొత్త టార్గెట్ ని ఇచ్చింది. సుకుమార్ ఒక్కో సినిమాకి ప్రస్తుతం 75 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారని సమాచారం.
Also Read:'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?





















