AP Inter 1st Year Results 2025: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Andhra Pradesh Inter results 2025 | ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం విడుదల చేశారు.

Andhra Pradesh Inter 1st Year Results 2025 | ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. రెగ్యులర్ తోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్ https://telugu.abplive.com/ లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
పాస్ శాతం, గత పదేళ్లలో రికార్డు
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రెండో సంవత్సరం విద్యార్థులు 83% పాస్ కాగా, ఫస్టియర్ విద్యార్థులు 70% శాతం పాస్ అయ్యారని నారా లోకేష్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,87,295 మంది హాజరుకాగా, 3,42,979 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్‌లో 38,553 మంది ఎగ్జామ్ రాయగా, 23,991 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా చూస్తే 70 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు
తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫస్టియర్ విద్యార్థులు ఫలితాలను తెలుసుకోవచ్చు. వాట్సాప్ మన మిత్ర యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకూ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించగా మొత్తం 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు
మన మిత్ర యాప్ నెంబర్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేసి AP Inter Results చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు. హాయ్ అని మెస్సేజ్ చేశాక, అందులో విద్యాశాఖకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఫలితాలు అనే అప్షన్ తీసుకుని, అనంతరం ఇంటర్ ఫలితాలపై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే ఇంటర్ విద్యార్థుల ఫలితాలు వస్తాయి. రిజల్ట్ డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ అధికారులు సూచించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి.
- Inter విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bieap.gov.in లేదా resultsbie.ap.gov.in ను సందర్శించాలి.
- 1వ లేదా 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాల కోసం లింక్‌పై క్లిక్ చేయాలి
- లాగిన్ వద్ద విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి
- వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తే స్క్రీన్ మీద విద్యార్థుల ఫలితాలు కనిపిస్తాయి.
- విద్యార్థులు ఆ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

