అన్వేషించండి

AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

AP Inter Board Exam Results 2025 | ఏపీలో నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.

Andhra Pradesh Inter results 2025 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫలితాలను https://telugu.abplive.com/ లో, https://resultsbie.ap.gov.in సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దాంతో మంత్రి నారా లోకేష్ ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం అవసరం లేదన్నారు. కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చేసే ఖర్చు తగ్గుతుందన్నారు.

వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ విద్యార్థులు ఫలితాలను మన మిత్ర యాప్‌ నెంబర్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు. హాయ్ అని మెస్సేజ్ చేశాక, అందులో విద్యాశాఖకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఫలితాలు అనే అప్షన్ తీసుకున్నాక, ఇంటర్ ఫలితాలపై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే మీ ఫలితాలు వచ్చేస్తాయి. రిజల్ట్ డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవాలని విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు.

ఈ ఏడాది మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలకుగానూ 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. మార్చి 1నుండి 19 వరకూ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 3 నుండి 20వ తేదీ వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించారు.    

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget