Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 31st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ముఖ్యమైన ఫైల్ మిస్సింగ్.. అరవింద, మిత్రల ముందు తలదించుకున్న లక్ష్మీ..!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ దాచిన ఫైల్ ఇంట్లో కనిపించలేదని ఇంట్లో తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ విడిపోయిన కడియాలు తీసుకొని గుడికి బయల్దేరుతుంది. పిల్లలు కూడా తల్లితో పాటు వస్తామని అంటారు. లక్ష్మీ ఇద్దరినీ తీసుకొని వెళ్తుంది. ఇక జయదేవ్, అరవింద మిత్ర ఒక్కడే రావడం చూసి లక్ష్మీ ఎక్కడ, కడియాలు ఏవి అని అడుగుతారు.
మనీషా వచ్చి నాతో కొంగు ముడి ఇష్టం లేక ఇలా చేశారని అంటుంది. దాంతో మిత్ర లక్ష్మీకి కల వచ్చిందని అప్పుడు విడిపోయావని కల చెప్తాడు. వెనకా ముందు ఆలోచించకుండా గర్భసంచి ఇచ్చేసింది ఇప్పుడు కలలో ఆడపిల్లని కనడం కంటే ఇంకేం చేస్తుందని అంటుంది. ఇక జాను, వివేక్ రావడం చూసిన జయదేవ్ ఆ విషయం మాట్లాడొద్దని చెప్తాడు. వివేక్ రాత్రి ఇంట్లో దొంగలు వచ్చారని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. దొంగని కొట్టామని పారిపోయారని చెప్తారు. ఇంట్లో నుంచి దొంగ ఏం పట్టుకోలేదని అంటారు. ఇక అప్పుడే అక్కడికి దేవయాని వస్తుంది. దేవయాని ముఖం మీద గాయాలు చూసి దేవయానిని అరవింద ప్రశ్నిస్తుంది. రాత్రి బాత్ రూమ్‌లో జారి పడిపోయానని దేవయాని అంటుంది. అన్ని గాయాలు ఎలా అయ్యావని అడిగితే బాత్ రూమ్‌లో రెండు మూడు సార్లు పడిపోయాను.. బాత్‌రూమ్‌లోనే ఉండిపోయానని అంటుంది.
వివేక్ జానుతో అందుకే అమ్మ రాత్రి గదిలో కనిపించలేదని అనుకుంటారు. ఇక జాను కాపడం పెడతానని దేవయానిని తీసుకెళ్తుంది. అరవింద ఫైల్ గురించి అడిగితే మిత్ర లక్ష్మీ ఫైల్ దాచిందని చెప్తాడు. మనీషా మనసులో ఇంకెక్కడ ఫైల్ మిత్ర రాత్రి దేవయాని ఆంటీ కొట్టేసి సంపులో పడేస్తే నేను ప్రతీ పేజీ ఆరపెట్టి సరయుకి ఫోటోలు పెట్టానని అనుకుంటుంది. లక్ష్మీ గుడికి వెళ్తుంది. కడియాలు గురించి పంతులుకి చెప్తుంది. తన సమస్య తీరలేదని ఎప్పటికీ జరగని కల తనకు వచ్చిందని తనకు ఆడపిల్ల పుట్టినట్లు కల వచ్చిందని చెప్తుంది. దానికి పంతులు దేవుడు తలచుకుంటే పరిష్కారం లేని సమస్య ఉండదు ఆలోచించు అమ్మ అని చెప్తారు. ఇక పిల్లలు కడియాలు విడిపోయినందుకు ఆంజనేయస్వామిని నిలదీస్తారు. ఆంజనేయస్వామి ఓ తాతలా వాళ్లకి కనిపిస్తారు. ఆంజనేయ స్వామికి కలపడం తప్ప విడదీయడం రాదని చెప్తారు. మమకారంతో ఏర్పడిన బంధం మాతృబంధం అని తెలిసిన వరకు ఈ కష్టాలు తప్పవని అంటారు. పిల్లలు తల పట్టుకుంటారు.
దేవయానికి జాను వేడి నీటి కాపడం పెడుతుంది. ఎవరో కొట్టినట్లు ఉన్నాయని అంటే అవును మీ ఇద్దరే నాకు కొట్టారని అంటుంది. అదేంటి అంటే కలలో కొట్టారని దేవయాని కవర్ చేస్తుంది. దేవయాని ష్మార్ట్ వాచ్ తీసుకురమ్మని వివేక్‌ని అడుగుతుంది. వివేక్ కనిపించడం లేదని అంటాడు. నేనే చూస్తానని దేవయాని లేచి ఇళ్లంతా వెతుకుతుంది. ఇక వివేక్‌కి కాల్ రావడంతో జేబులో ఉన్న వాచ్ పడిపోతుంది. జాను చూసి దేవయాని చూడకుండా జాను అడ్డుపడుతుంది. వాచ్ ఎక్కడికీ పోదులే అని అంటాడు. బగ్ ఫిక్స్ చేయిస్తానని అంటే దేవయాని ఏంటి అని అంటే జాను రింగ్‌లో స్టోన్ ఊడిపోయింది అందుకే వెళ్తున్నాఅంటాడు. వీడికి ఎప్పుడూ పెళ్లాం పనులే తప్ప నా గురించి అవసరం లేదని అనుకుంటుంది.
లక్ష్మీ గుడి నుంచి వస్తుంది. నాకు వచ్చిన కల నాకు దేవుడు ఇచ్చిన సమాధానం అని పంతులు చెప్పారని ఏం అర్థం కాలేదని లక్ష్మీ అంటే మనీషా చాటుగా నీకు ఇప్పటికే ఆడపిల్ల పుట్టిందని అర్థం అని అనుకుంటుంది. ఇక మిత్ర ఫైల్ తీసుకురమ్మని అంటాడు. లక్ష్మీ మొత్తం వెతుకుతుంది కానీ ఫైల్ కనిపించదు. అరవింద అందరూ ఫైల్ కోసం ఎదురు చూస్తారు. జాను వచ్చి పిలిస్తే లక్ష్మీ ఫైల్ కనిపించడం లేదని చెప్తుంది. దాంతో జాను రాత్రి దొంగ తీసుకెళ్లాడా ఏంటా అనుకుంటుంది. లక్ష్మీని మిత్ర పిలుస్తాడు. లక్ష్మీ కిందకి వచ్చి ఫైల్ కనిపించడం లేదని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

