Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని పాస్‌బుక్ ఎలా పొందాలి, ఎంత ఫీజు చెల్లించాలి
Telangana News | తెలంగాణ ప్రభుత్వం ధరణి చట్టం, పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి చట్టం పోర్టర్ ప్రారంభించారు.

Bhu Bharati Act | తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. గత ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) ను రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు భూభారతి చట్టం అమలుకు సంబంధించి భూ భారతి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూభారతి చట్టం పోర్టల్ లాంచ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపాం, ప్రజల భూములను కాపాడేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు.
పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలి..
భూభారతి చట్టం ప్రకారం భూమి యజమాని 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం అధికారులు జారీ చేస్తారు. అయితే భూ రికార్డుల్లో వివరాలు నమోదై ఉండాలి. లైసెన్స్ డ్ సర్వేయర్ తో సర్వే చేయించుకుని భూమి యజమాని మ్యాప్ తయారు చేయించుకోవాలి. మండల సర్వేయర్ ఈ వివరాలు చెక్ చేశాక పట్టాదారు పాస్ బుక్ లో మ్యాప్ ను నమోదు చేస్తారు. తమ పాస్ బుక్ లో మీ వివరాలు సరిగా లేవని అప్లికేషన్ ఇస్తే ఎమ్మార్వో ఆ వివరాలు పరిశీలించి సరి చేస్తారు. ఎమ్మార్వో నిర్ణయం పై సైతం అభ్యంతరాలు ఉన్నట్లయితే మొదట ఆర్డీవోకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జిల్లా కలెక్టర్ సైతం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, భూదాన్, ఒక్కో భూములకు ఎవరైనా పట్టాలు పొందితే వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతి చట్టంలోని 16వ సెక్షన్ 15వ నిబంధన ద్వారా ఇలాంటి భూములపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. బీఆర్ఎస్ అమలు చేసిన ధరణిలో మాత్రం ఇలాంటి నిబంధనలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు. మనిషికి ఆధార్ ఉన్నట్లుగానే, భూములకు భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు.
వారికి ఉచిత న్యాయ సహాయం, సలహా
గ్రామ రెవెన్యూ రికార్డుల వివరాలు నమోదు చేసేందుకు ధరణి చట్టంలో అవకాశం లేదు. భూభారతి చట్టంలో ఈ లోపాన్ని సవరించి గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13 నిబంధన 12 ను చేర్చాము. ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ముద్రించి ప్రత్యేకంగా భద్రపరుస్తాము. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చాక.. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయడం లేదు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వ భూములు, గ్రామ పహాని, నీటి వనరుల భూముల రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. సెక్షన్ 15 (8) నిబంధన 16 ప్రకారం మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయం అందించనున్నాం. భూ చట్టాల్లో ఇలాంటి నిబంధన చేర్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నేను ఇచ్చింది. న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థలు, వ్యవస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలను అందించడం లాంటిది ధరణి చట్టంలో లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు లేవు. దాంతో హైకోర్టు క్రమబద్ధీకరణ పై స్టే విధించింది. భూభారతి చట్టంలో ని 6వ సెక్షను, ఆరో నిబంధన ప్రకారం సాదా బైనామాలను రెగ్యులరైజు చేస్తారు. అయితే ఎలాంటి చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారణ జరిగితే క్రమబద్ధీకరణ చేస్తారు. స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జ్, 100 రూపాయల ఫైన్ కలిపి వసూలు చేసి డాక్యుమెంట్ జారీ చేస్తారు. అనంతరం రికార్డుల్లో చేర్చిన తర్వాత పట్టాదారుకు పాస్ పుస్తకం జారీ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

