అన్వేషించండి

‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘వార్ 2’ షూటింగ్ అప్డేట్ - 100 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్న హృతిక్, తారక్
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. ఎందుకంటే ఈ చిత్రంతోనే జూనియర్ ఎన్‌టీఆర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎన్‌టీఆర్ ప్రకటించకపోయినా.. హృతిక్ రోషన్ మాత్రం తనకు ఎన్‌టీఆర్‌తో కలిసి నటించడం ఎగ్జైటింగ్‌గా ఉందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. దీంతో ‘వార్ 2’ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈ హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ‘వార్ 2’ షూటింగ్‌పై ఒక కీలకమైన అప్డేట్ బయటికొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?
పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్నది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ‘ఓజీ’ గురించేనా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా 53 ఏళ్ల కెరీర్‌లో అలాంటిది జరగలేదు - సందీప్ వంగాపై జావేద్ అఖ్తర్ ఫైర్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు నెలలు అయిపోయింది. ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమాను చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పటికీ దీనిపై వస్తున్న కాంట్రవర్సీలకు బ్రేక్ పడడం లేదు. బాలీవుడ్‌లోని పలువురు బడా స్టార్లు ఇప్పటికీ ‘యానిమల్’ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. అందులో జావేద్ అఖ్తర్ కూడా ఒకరు. ఇప్పటికే ఒక ఈవెంట్‌లో ‘యానిమల్’పై విమర్శలు చేసిన జావేద్.. మరోసారి ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి చూస్తుంటే ఇక పవర్ స్టార్ సినిమాలపై ఆశలు వదిలేసుకోవాలేమో అనుకున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోనే పర్యటిస్తూ.. సభ్యలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. దీంతో తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్‌ప్రైజ్‌తో పాటు షాక్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురుచూడమంటూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్‌’ తెలుగు వెర్షన్‌ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ, బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నేటితో వారి ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఎట్టకేలకు హనుమంతుడు డిజిటల్ వేదికల మీదకు వచ్చేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget