![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?
Ustaad Bhagat Singh Update: హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు. ఇదే సమయంలో ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
![Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా? Mythri Movie Makers releases dubbing stills of pawan kalyan for Ustaad Bhagat Singh Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/5d58bfe2f3b6c69f9917548de09c60ec1710659066419802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ustaad Bhagat Singh Update: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి చూస్తుంటే ఇక పవర్ స్టార్ సినిమాలపై ఆశలు వదిలేసుకోవాలేమో అనుకున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోనే పర్యటిస్తూ.. సభ్యలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. దీంతో తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్‌ప్రైజ్‌తో పాటు షాక్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురుచూడమంటూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచాడు.
ఇన్నేళ్ల తర్వాత..
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో చాలా ఏళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్’ అనే సినిమా వచ్చింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్‌లో ఉన్న పవన్‌ను ఈ సినిమా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. అప్పటినుండి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి మళ్లీ ఎప్పుడెప్పుడు మూవీ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. ఫైనల్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ దీని అనౌన్స్‌మెంట్ వచ్చి, షూటింగ్ మొదలయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వరుసగా సినిమాలను ఒప్పుకొని షూటింగ్ ప్రారంభించిన తర్వాత పవన్.. పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పెద్ద బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు దీని నుండి ఒక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు.
టీజర్ గురించేనా.?
‘మీరు ఊహించనిది జరగబోతుంది. మార్చి 19’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మైత్రీ మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో ఈ నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఫోటోలు, అందించిన అప్డేట్ చూసి మార్చి 19న మూవీ టీజర్ విడుదల కానుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించిన ఒక గ్లింప్స్ చాలాకాలం క్రితమే రిలీజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వచ్చేది టీజరే అని సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలయ్యాయి. గ్లింప్స్‌తో ఆకట్టుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌తో ఏం మ్యాజిక్ చేస్తాడా అని అందరూ ఎదురుచూడడం మొదలుపెట్టారు.
Expect the unexpected 😎
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
19th March ❤️🔥❤️🔥❤️🔥#UstaadBhagatSingh pic.twitter.com/JZfYC5en6y
లుక్‌పై ట్రోల్స్..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి గ్లింప్స్ విడుదలయిన తర్వాత ఇప్పటివరకు ఆ మూవీ నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ లుక్‌ను మాత్రం రిలీజ్ చేశారు మేకర్స్. ఆ లుక్‌పై సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. ‘భీమ్లా నాయక్’లాగా ఉందంటూ పోలికలు వినిపించాయి. అప్పటినుండి ఇప్పటివరకు మరో అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో జోష్ తగ్గిపోయింది. మళ్లీ ఈ టీజర్ అప్డేట్‌తో అందరూ హ్యాపీ అవుతున్నారు. తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన ‘తేరీ’కి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్‌గా తెరకెక్కింది. ‘తేరీ’ చిత్రం తెలుగులో డబ్ అయినా కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో తన స్టైల్‌లో దీనిని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు హరీష్ శంకర్.
Also Read: ఫస్ట్ నైట్ రోజు మందు తాగితే తప్పేంటి? - 'లవ్ గురు' హీరోయిన్ మృణాళిని
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)