అన్వేషించండి

War 2: ‘వార్ 2’ షూటింగ్ అప్డేట్ - 100 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్న హృతిక్, తారక్

War 2: హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వీరు కలిసి నటిస్తున్న ‘వార్ 2’ షూటింగ్ అప్డేట్ వచ్చింది.

War 2 Movie Update: ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. ఎందుకంటే ఈ చిత్రంతోనే జూనియర్ ఎన్‌టీఆర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎన్‌టీఆర్ ప్రకటించకపోయినా.. హృతిక్ రోషన్ మాత్రం తనకు ఎన్‌టీఆర్‌తో కలిసి నటించడం ఎగ్జైటింగ్‌గా ఉందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. దీంతో ‘వార్ 2’ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈ హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ‘వార్ 2’ షూటింగ్‌పై ఒక కీలకమైన అప్డేట్ బయటికొచ్చింది.

రిలీజ్ డేట్ ఫిక్స్..

‘వార్’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. కానీ దాని సీక్వెల్ బాధ్యతలు మాత్రం ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చేతికి వెళ్లాయి. ‘వార్ 2’ను ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ప్లానింగ్ మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ షూటింగ్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. 2025 ఆగస్ట్ 14వ తేదీన ‘వార్ 2’ థియేటర్లలో సందడి చేస్తుందని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అందుకే షూటింగ్ మొదలుపెట్టడం కోసం హృతిక్ రోషన్ 100 రోజులు కాల్ షీట్స్‌ను ఇచ్చాడని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ 100 రోజుల్లోనే ఎన్‌టీఆర్‌తో కాంబినేషన్ సీన్స్‌తో పాటు తను షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని హృతిక్ ప్లాన్ చేస్తున్నాడట.

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు..

‘వార్ 2’ హృతిక్ రోషన్‌తో పాటు ఎన్‌టీఆర్‌కు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అందుకే హృతిక్ రోషన్‌లాగానే ఎన్‌టీఆర్ కూడా 100 రోజుల కాల్ షీట్స్‌ను ఈ సినిమా కోసం అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్, ఫైట్స్.. మొదటి భాగాన్ని మించి ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా హృతిక్, ఎన్‌టీఆర్‌ను ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్ చేస్తుంటే చూడాలని మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలో ఎన్‌టీఆర్‌కు ఇదే మొదటి చిత్రం కాబట్టి ‘వార్ 2’పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఈ ఇద్దరు పెద్ద స్టార్లను స్క్రీన్‌పై ఎలా చూపిస్తాడో అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ముంబాయ్‌లో షూటింగ్..

‘వార్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం అవ్వకపోయినా ముంబాయ్‌లో హృతిక్ రోషన్‌తో పలు షెడ్యూల్స్‌ను పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నాడు అయాన్ ముఖర్జీ. త్వరలోనే మరో షెడ్యూల్‌లో కియారా అద్వానీ కూడా జాయిన్ అవ్వనుంది. ఈ ఏడాది చివరిలోపు షూటింగ్‌ను ఎలాగైనా పూర్తి చేసి 2025లో అనుకున్న డేట్‌కు మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ‘వార్ 2’ కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఒక భాగమే. ఇప్పటికే ఈ పాపులర్ బాలీవుడ్ స్పై యూనివర్స్ నుండి అయిదు చిత్రాలు రాగా.. ‘వార్ 2’ అందులో 6వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫైనల్ అవ్వగా మరో హీరోయిన్ ఎవరు అయ్యింటారా అని ప్రేక్షకులు గెస్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: ఈసారి చెర్రీ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget