అన్వేషించండి

Ram Charan Birthday Special: ఈసారి చెర్రీ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే?

Ram Charan's Birthday Special: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 27న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం మెగా వారసుడి బర్త్ డే మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ గా మారబోతోంది.

Ram Charan's Birthday Special: మార్చి 27.. మెగా అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. దీని కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అటు ఆన్ లైన్ లో, ఇటు ఆఫ్ లైన్ లో సంబరాలు జరగబోతున్నాయి. 
 
రామ్ చరణ్ కు ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే తండ్రి అయిన తర్వాత మెగా వారసుడు జరుపుకోనున్న మొదటి పుట్టినరోజు ఇది. ఇప్పటి వరకూ తన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకున్న చెర్రీ.. ఈసారి వారితో పాటుగా తన ముద్దుల కుమార్తె క్లిన్ కారా సమక్షంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్ గా మార్చడానికి చరణ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. 
 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చెర్రీ బర్త్ డేకి ఈ మూవీ నుంచి కంటెంట్ రాబోతున్నట్లు నిర్మాత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయొచ్చనే టాక్ నడుస్తోంది. అదే రోజున విడుదల తేదీపైనా స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. 
 
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. 
 
ఇకపోతే రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా, వివి వినాయిక్ దర్శకత్వంలో ఆయన నటించిన 'నాయక్' మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజున చెర్రీ ఆల్రెడీ సైన్ చేసిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావొచ్చని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ సంవత్సరం మెగా వారసుడి పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా నిలవబోతోందని అర్థమవుతోంది.
 

టాప్ హెడ్ లైన్స్

Nani Kayadu Lohar : జడల్ సుబ్బు డీప్ లవ్ - ట్రెండింగ్‌లో ద ప్యారడైజ్ ఇంటెన్స్ పోస్టర్
జడల్ సుబ్బు డీప్ లవ్ - ట్రెండింగ్‌లో ద ప్యారడైజ్ ఇంటెన్స్ పోస్టర్
MS Subbulakshmi Biopic: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌తో పోల్చిన కమల్... ఎమోషనల్ అయిన రష్మిక - ఎంఎస్ బయోపిక్ లాంచ్ విశేషాలు
మైఖేల్ జాక్సన్ బయోపిక్‌తో పోల్చిన కమల్... ఎమోషనల్ అయిన రష్మిక - ఎంఎస్ బయోపిక్ లాంచ్ విశేషాలు
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Embed widget